Megastar Chiranjeevi : స్టేజ్ పైనే చిరంజీవి ఎమోషనల్.. ఆమెను తలుచుకుంటూ..!

Megastar Chiranjeevi : తెలుగు సినీ చరిత్రలో మకుటం లేని మహారాణిగా తన అందంతో , నటనతో అందరిని అబ్బురపరిచిన దివంగత నటి సావిత్రి.. సినీ జీవితంపై వచ్చిన తాజా పుస్తకం ‘సావిత్రి క్లాసిక్స్’.. ఈ పుస్తకాన్ని సంజయ్ కిషోర్ రచించగా.. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పబ్లిష్ చేసింది.. ఈ బుక్ లాంఛ్ వేడుక మంగళవారం హైదరాబాదులో ఘనంగా జరగగా.. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై ‘ సావిత్రి క్లాసిక్స్ ‘పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సావిత్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు..

సావిత్రి పై చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్..

ఈ పుస్తక ఆవిష్కరణకు వారధిగా నిలిచిన నాకు దక్కిన అమూల్యమైన అవకాశంగా భావిస్తాను.. మహానటి సావిత్రి పై రాసిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు చాలా సంతోషంగా ఉంది.. అంతేకాదు ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం నా జన్మ సార్ధకం.. సావిత్రి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ.. నాకు తల్లి లాంటి సావిత్రి గురించి చెప్పడానికి ఉద్వేగంతో మాటలు రావడం లేదు. నేను నటనలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు శిక్షణ పూర్తి అవ్వకముందే నాకు పునాది రాళ్లు సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది.. ఈ సినిమా షూటింగ్ వెళ్లేటప్పుడు నేను సావిత్రితో కలిసి నటిస్తున్నానని నాకు తెలిసింది.. ఆ విషయం తెలియగానే ఒక్కసారిగా నాకు షాక్ కొట్టినట్లు అనిపించింది .. అయితే షూటింగ్ తర్వాత నన్ను సావిత్రి వద్దకు తీసుకెళ్లగా.. ఆవిడను చూడగానే నాకు నోట వెంట మాట రాలేదు.. ఈ మహానటి నేనా.. ఇన్నాళ్లు నేను ఆరాధించేది అంటూ అనుకున్నాను.. నన్ను చూసి నీ పేరేంటి బాబు అని అడిగారు..నా పేరు చిరంజీవి అమ్మా అన్నాను..అప్పుడు సావిత్రి శుభం అని అన్నారు.. ఆ తర్వాత సినిమా షూటింగ్లో వర్షం పడగా.. డాన్స్ చేస్తూ కింద పడ్డాను.. కింద పడ్డా కూడా లేచి ఆపకుండా డాన్స్ చేయడం ఆపలేదు… ఇది చూసిన సావిత్రి నీకు మంచి ఫ్యూచర్ ఉంది.. ఫ్యూచర్ లో ఒక గొప్ప నటుడివి అవుతావు.. అంటూ నాతో చెప్పారు. నాడు ఆమె ఇచ్చిన ఆశీర్వాదాలే నేడు మీ ముందు మెగాస్టార్ ( Megastar Chiranjeevi ) గా నిలబడ్డానికి కారణమయ్యాయి.. ఆమె ఎంతో గొప్ప నటి మాత్రమే కాదు అంతకుమించి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా. అలాంటి లెజెండ్రీ యాక్ట్రెస్ ను మళ్లీ మనం చూస్తామో లేదో అంటూ ఎమోషనల్ అయ్యారు.. మొత్తానికైతే స్టేజ్ పైన చిరంజీవి కన్నీటిని పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది..

సావిత్రి క్లాసిక్స్ పుస్తక ఆవిష్కరణకు విచ్చేసిన అతిధులు..

ఈ కార్యక్రమానికి రచయిత సంజయ్ కిషోర్, నిర్మాత అల్లు అరవింద్, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, సావిత్రి కుమారుడు సతీష్ కుమార్, సీనియర్ నటులు మురళీమోహన్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, జయసుధ తదితర సీనియర్ నటీనటులు హాజరయ్యారు.. ఇక ఒక్కొక్కరు ఈ పుస్తక ఆవిష్కరణలో భాగంగా సావిత్రి గారితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు