Mrunal Thakur : తెలుగు ఆడియెన్స్ మామూలు వాళ్లు కాదు… నా అడ్రస్ మార్చేశారు

Mrunal Thakur : ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ఈమె తెలుగు వారి గుండెల్లో సీతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో నటించి మరొకసారి ఆడియన్స్ ను మెప్పించింది.. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తెలుగు ఆడియన్స్ పాదాభివందనం చేసింది..

తెలుగు ఆడియోస్ కి మృణాల్ పాదాభివందనం..

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు.. గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈమె చాలా చురుగ్గా పాల్గొంటుంది. అందుకు కారణం తెలుగు ఆడియన్స్ తనపై చూపుతున్న ప్రేమ అని చెబుతోంది.. నిన్న ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. అక్కడికి మృణాల్ తన ఫ్యామిలీని కూడా తీసుకొచ్చారు.. తనకు ఇక్కడ ఉన్న అభిమానాన్ని తన కుటుంబానికి సైతం చూపించారు.. దీంతో మృణాల్ ఠాకూర్ తన పై ఇంతటి అభిమానం చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను అంటూ ఆమె స్టేజ్ పైనుంచి అభిమానులకు, తెలుగు ఆడియన్స్ కు పాదాభివందనం చేసింది.

ఫ్యామిలీ స్టార్ లో తన పాత్ర పై స్పందన..

అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. మృణాల్ చేసిన ఈ పనికి తెలుగు అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.. మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ సినిమాలో ఇందు అనే పాత్రలో నటించబోతోంది. ఈ పాత్ర కూడా తను ఇప్పటివరకు నటించిన సినిమాల కంటే మరింత అట్రాక్ట్ చేసేలా అభిమానుల గుండెలలో నిలిచిపోయేలా ఉంటుందంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం ఏప్రిల్ 5న తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదల చేయబోతున్నారు చిత్ర బృందం.

- Advertisement -

బాలీవుడ్ ను కాదని

సీతారామం, హాయ్ నాన్న వంటి చిత్రాలతో వరుసగా సక్సెస్ మీద ఉన్న మృణాల్ ఠాకూర్ కు ఫ్యామిలీ స్టార్ సినిమా తో సక్సెస్ అందుకొని హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి మరి.. బాలీవుడ్ లో కూడా అడపాదడపా సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది.. వాస్తవానికి బాలీవుడ్ హీరోయిన్ అయిన ఈమె అక్కడ అవకాశాలు వస్తున్నా కూడా తెలుగు అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు మంత్రముగ్ధురాలై.. తెలుగులోనే సినిమాలు చేస్తూ.. సౌత్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఫ్యాన్స్ కోరిక..

అటు తెలుగు ఆడియన్స్ కూడా ఈమె ఇక్కడే.. వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా చలామణి అవ్వాలని కోరుకుంటున్నారు.. మరి అభిమానుల కోరిక మేరకు మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) ఇక్కడే సెటిల్ అవుతుందా లేక అందరి హీరోయిన్స్ లాగే మళ్లీ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు