Kriti sanon : ఎలాగైతేనేం ఫైనల్ గా ట్రాక్ లో పడింది!

Kriti sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో వన్ నేనొక్కడినే సినిమాతో గ్రాండ్ గా హీరోయిన్ గా ఎంట్రీ ఇద్దామనుకుని ఫస్ట్ మూవీతోనే ప్లాప్ ని అందుకుంది. ఇంకేముంది ఒక్క సినిమా ప్లాప్ కే బాలీవుడ్ చెక్కేసింది ఈ ఫేర్ అండ్ లవ్లి బ్యూటీ. అక్కడ ఫస్ట్ సినిమా సక్సెస్ కావడంతో అక్కడే ఉండిపోయిది. అయితే ఆ సక్సెస్ అక్కడితోనే ఆగిపోయింది గాని, కృతి గ్లామర్ కి బాలీవుడ్ లో మాత్రం ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వరుస సినిమాలు చేసింది. కానీ ఒక్కటంటే ఒక్క సరైన హిట్టు దక్కలేదు. అప్పుడెప్పుడో చేసిన మిమి సినిమాతో నటిగా ప్రశంసలు దక్కించుకున్నా సక్సెస్ దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆది పురుష్ దారుణంగా దెబ్బకొట్టింది. ఆ తర్వాత కూడా మరో రెండు బడా సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఇక ఈ అమ్మడి పని అయిపోయినట్టే అని జనాలు అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ ఇయర్ మాత్రం పుంజుకుంది. ఫైనల్ గా గాడిలో పడింది. దానికి కావాల్సింది కాస్త అదృష్టం, అలాగే బాగా ఓపిక కూడా.

టాలెంట్ కి లక్ తో పాటు టైం..

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో కెరీర్ పరంగా హీరోయిన్లకు ఎదురయ్యే అనుభవాలు విచిత్రంగా ఉంటాయి. కాస్త ఓపిక పడితే అద్భుతాలు జరుగుతాయి. మొన్నటికిమొన్న సీనియర్ అయిపోయింది కదా ఎవరు ఆఫర్లిస్తారనుకుంటే త్రిష ఏకంగా సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా నయనతారను దాటేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే ఇదే క్రమంలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఐరెన్ లెగ్ పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే అప్పట్లో వరుస హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్ అయింది. కట్ చేస్తే ఇప్పుడు వరుస ప్లాప్ లతో కెరీర్ గ్రాఫ్ మరీ కిందకు వెళ్ళిపోతోంది. ఛాన్సులు ఇచ్చే వాళ్ళు కరువయ్యారు. సక్సెస్ మాత్రమే మాట్లాడే సినీ పరిశ్రమలో ఇలాంటివి సహజమే. ఇక కృతి సనన్ విషయానికి వస్తే పెద్దగా హిట్లు లేకపోయినా అలా యావరేజ్ సినిమాలతో నెట్టుకొస్తున్న కృతి సనన్ కి గత ఏడాది హ్యాట్రిక్ డిజాస్టర్లు పడ్డాయి. ఆదిపురుష్, షెహజాదా, గణపత్ ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా దెబ్బ కొట్టాయి. ప్రభాస్ ఇమేజ్ పుణ్యమాని ఆది పురుష్ భారీ వసూళ్లు తేవడంతో పాటు సీతగా కృతి బాగా ఒకే అనే పేరు ఇచ్చింది.

ఫైనల్ గా సక్సెస్..

అయితే అనూహ్యంగా ఈ ఇయర్ కృతి సనన్ (Kriti sanon) కు బాగా కలిసి వస్తోంది. ఈ ఇయర్ లో తక్కువ గ్యాప్ లో రిలీజైన రెండు సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. క్రిటిక్ రివ్యూలు బ్లాక్ బస్టర్ రేజ్ లో లేకపోయినా సినిమాలు మాత్రం ఊహించని విజయం సాధించాయి. షాహిద్ కపూర్ తో కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ‘తేరి బాతో మే ఐసా ఉల్జా జియా’ జనాలకు ఓ మోస్తరుగా నచ్చేసి మంచి విజయం సాధించింది. ముంబై లాంటి ప్రధాన కేంద్రాల్లో ఈ సినిమా యాభై రోజులకు పరుగులు పెడుతోంది. ఈ సినిమాలో కృతి సనన్ ఒక రోబో గా నటించడం విశేషం. ఇక లేటెస్ట్ గా కృతి సనన్ నటించిన మరో సినిమా ‘క్రూ’ కూడా ఇదే బాట పట్టింది. క్రిటిక్స్ సాలిడ్ మూవీ అని చాలా బాగుందని మెచ్చుకోకయినా కంటెంట్ లో ఉన్న కామెడీ, సస్పెన్స్ రెండూ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యాయి. గత అయిదేళ్లలో ఏకంగా పది ఫ్లాపులతో కృతి సనన్ కెరీర్ బాగా డౌన్ అయింది. ఆ మధ్యలో మిమికి జాతీయ అవార్డు రావడం మినహాయించి హ్యాపీ గా ఫీలయ్యే క్షణాలు తక్కువగానే ఉన్నాయి. ఇలాంటి టైంలో 2024 ఫుల్ కిక్ ఇస్తోంది. వరుస గా రెండు సక్సెస్ లు దక్కడంతో కృతి సనన్ కెరీర్ గాడిలో పడినట్టే అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు