NBK 109 : బాలయ్య – బాబీ కాంబో టైటిల్ ఫిక్స్.. టైటిల్ తోనే గూస్ బంప్స్..!

NBK 109 : నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య.. 109వ సినిమాను డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో నడుస్తోంది. కానీ తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక న్యూస్ అటు తెలుగు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోందని చెప్పవచ్చు. అదేమిటంటే అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తూ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.. ఈ సినిమా కోసం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ‘వీరమాస్’ అనే ఒక టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా సమాచారం. అయితే ఈ టైటిల్ బాలయ్య సినిమా కోసమా ? లేకపోతే మరో సినిమా కోసమా? అన్నది మాత్రం తెలియడం లేదు.

టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించిన సితార బ్యానర్..

ఈ విషయం పైన సితార బ్యానర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న బాలయ్య సినిమాలో బాలయ్యకు జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే విలన్ గా బాబి డియోల్ కూడా నటిస్తున్నారు. కీలకమైన పాత్రలో దుల్కర్ సల్మాన్, చాందిని చౌదరి వంటి వారు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్లోనే తెరకెక్కిస్తున్నారు.

బాలయ్య మూవీకి సహనిర్మాతలు వీరే..

అలాగే నిర్మాత నాగవంశీతోపాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా సహ నిర్మాతగా ఈ చిత్రానికి వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే సాయి సౌజన్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థ కూడా ఈ సినిమాలో భాగస్వామిగా మారనుంది. మొత్తానికి అయితే పెద్ద బ్యానర్లు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బాలయ్య వారికి ఎలాంటి ఆదాయాన్ని తెచ్చి పెడతారో చూడాలి..

- Advertisement -

అదిరిపోయే మ్యూజిక్..

ఇప్పటికే ప్రముఖ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమా కోసం బాలయ్య అనే అదిరిపోయి మ్యూజిక్ ఇస్తూ ఉండగా.. ఈ పాటతో పాటు ఈ చిత్రంలోని అన్ని పాటలకు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.. దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి..

బాలకృష్ణ రాజకీయ జీవితం..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి.. పొత్తులో భాగంగా బిజెపి, జనసేన టిడిపి పార్టీలు కూటమిగా ఏర్పడి.. అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సిపి ని ఎలాగైనా ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు.. ఇక మరొకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న బాలయ్య మళ్ళీ తన స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రజలలో మమేకం అవుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు.. సినిమాల ద్వారా భారీ సక్సెస్ అందుకున్న బాలయ్య అక్కడ హిందూపురం ప్రజలకు అన్ని రకాలుగా సహాయాలు అందిస్తూ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారు.. మరి ఈసారి కూడా అక్కడ సీటు ఆయనదే అని తెలుస్తోంది .. మరి ఏ మేరకు బాలయ్య అటు రాజకీయాలలో ఇటు సినిమా రంగంలో సక్సెస్ అవుతారో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు