Family Star : సెన్సార్ పనులు పూర్తి.. ఆ విషయంలోనే డౌట్?

Family Star : రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫైనల్ గా ఏప్రిల్ 5న రిలీజ్ కి రెడీ కాబోతుంది. ఈ సినిమాపై ముందు నుండి ప్రేక్షకుల్లో మంచి క్రేజీ బజ్ నెలకొని ఉంది. విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇంతకు ముందు విజయ్ పరశురామ్ కాంబోలో వచ్చిన గీతా గోవిందం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే కాంబోలో సినిమా అంటే ప్రేక్షకులు ఎంతగానో ఎక్స్పెక్ట్ చేస్తారు. వాటన్నికి మించి సినిమా ఉండబోతుందని మేకర్స్ ఇదివరకే పలుమార్లు చెప్పారు. ఇక తెలుగులో రెండు వరుస హిట్ల తర్వాత మృణాల్ ఠాకూర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ కాబోతుండగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతామని నమ్మకంగా ఉంది. ఇక ఈ సినిమా టీజర్ వచ్చినప్పటినుండే సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ వచ్చింది. టీజర్, పాటలు ట్రోలింగ్ కి గురయినా అది సినిమాకి ప్లస్ పాయింట్ గా మారడం విశేషం. ఇక తాజాగా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది చిత్ర బృందం.

సెన్సార్ పనులు పూర్తి..

భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్న ఫ్యామిలీ స్టార్(Family Star) తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరుపుకుంది. ఆ ఈవెంట్ లో దిల్ రాజు సహా సినిమా పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు కనిపించింది. ఈ సినిమాతో వంద కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. ఇక తాజాగా ఫ్యామిలీ స్టార్ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసేసుకుంది. అందరూ అనుకున్నట్టే ఈ సినిమాకు UA సర్టిఫికెట్ రావడం జరిగింది. ఇక సినిమా రన్ టైం రెండు గంటల నలభై మూడు నిమిషాలుగా నిర్ణయించబడింది.

సినిమాకి అది మైనస్సా? ప్లస్సా?

అయితే తాజాగా ఫ్యామిలీ స్టార్ సెన్సార్ పనులు పూర్తయ్యాక రన్ టైం 2 గంటల 43 నిముషాలు గా డిసైడ్ చేయగా, కొందరు ట్రేడ్ విశ్లేషకులు రన్ టైం కాస్త మైనస్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. రీసెంట్ గా రన్ టైం ఎక్కువగా ఉన్న చిత్రాలు అంతగా బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఆడలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన సలార్ కి అదే మైనస్ అయి ఆడియన్స్ కి బోర్ కొట్టించింది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ది గోట్ లైఫ్ సినిమా ఏకంగా మూడు గంటల నిడివి తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. అయితే సినిమా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ కాస్త ఎక్కువసేపు ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తారని, అది ప్లస్ అవుతుందే కానీ మైనస్ ఎలా అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా కంటెంట్ బాగుండి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తే లాంగ్ రన్ టైమే ప్లస్ అవుతుంది. కానీ కంటెంట్ బాగా లేకపోతే ప్రేక్షకులు లాంగ్ రన్ టైం వల్ల మరింత బోర్ ఫీలయ్యే ఛాన్స్ కూడా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు