Vijay deverakonda Liger : లైగర్ ఎఫెక్ట్ విజయ్ ను మరింత బాధిస్తోందా.. రూ.200 కోట్లు అంటూ..!

Vijay deverakonda Liger : టాలీవుడ్ రౌడీ హీరోగా పేరుపొందిన విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ఈ సినిమా పైన భారీగానే అభిమానులకు అంచనాలు ఏర్పడ్డాయి.. ముఖ్యంగా గీతాగోవిందం కాంబినేషన్లో ఈ సినిమా వస్తూ ఉండడంతో అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.. గీతా గోవిందం చిత్రం తర్వాత తనకు అంతటి రేంజ్ లో మళ్లీ హిట్ పడలేదని.. ఆ సినిమా రూ.100 కోట్లు కలెక్షన్ చేసింది.. లైగర్ సినిమా భారీ ఫ్లాప్ తర్వాత.. ఖుషీ చిత్రంతో పర్వాలేదు అనిపించుకున్నారు విజయ్ దేవరకొండ.

లైగర్ ఎఫెక్ట్ భారీగానే పడిందే..

కానీ లైగర్ సినిమా రిలీజ్ కి ముందు చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లైగర్ సినిమా ( Vijay deverakonda Liger ) మినిమం రూ .200 కోట్లు కలెక్షన్ చేస్తుందంటూ విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మళ్ళీ ఇప్పుడు ఆ విషయాలను సైతం వైరల్ గా చేస్తున్నారు. అయితే లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో ఆ వ్యాఖ్యలను పట్టుకొని చాలామంది తనని ట్రోల్ చేశారని.. తిట్టారని ఎన్నోసార్లు వెల్లడించారు. మళ్లీ ఆ విషయాలను ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడడం జరిగింది విజయ్ దేవరకొండ.

యాటిట్యూడ్ అన్నారు..

ఈ విషయాల పైన స్పందిస్తూ.. విజయ్ దేవరకొండ ఇలా మాట్లాడుతూ.. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం.. మీకు మంచి సినిమాలు ఇవ్వడం కోసమే చాలా ట్రై చేస్తూ ఉంటాను. కానీ ఇప్పటికీ గీతాగోవిందం సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో మిమ్మల్ని అలరించలేకపోయాను.. ఆ సినిమా రూ .100 కోట్లు సాధించింది.. ఆ తర్వాత ఒక సినిమా తో రూ.200 కోట్లు కొడతానని చెప్పాను.. కానీ ఫెయిల్యూర్ గా మిగిలిపోయాను ..ఇప్పటికీ కూడా చాలామంది అలాంటి మాటలు ఎందుకు అంటుంటావు..అది తప్పు అని కోపంగా, ప్రేమగా చెబుతూనే ఉంటారంటూ తెలిపారు.. చాలామంది నువ్వు అలా మాట్లాడితే పొగరు అనుకుంటారని కూడా చెప్పారని తెలిపారు విజయ్ దేవరకొండ..

- Advertisement -

రూ.200 కోట్లు సాధించి తీరుతా..

కానీ ఈరోజు మళ్లీ చెబుతున్న రూ.200 కోట్లు కొడతానని చెప్పడం తప్పు కాదు.. చెప్పి కొట్టకపోవడం తప్పు.. దీనివల్ల నేను ఎన్నో తిట్లు తిన్నాను.. అవమానాలను కూడా ఎదుర్కొన్నాను.. కానీ ఏదో ఒక రోజు నేను రూ.200 కోట్లు కొడతా.. అప్పటివరకు తిడుతూనే ఉండండి అంటూ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడడం జరిగింది.. ఇప్పుడు కూడా తన మాటలను విని పొగరు బలుపు అనుకుంటారు ..కానీ నా మీద నాకున్న కాన్ఫిడెంట్ అదే అంటూ అంటూ వెల్లడించారు విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇలాంటి వ్యాఖ్యలు అన్నిటికీ కూడా ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ చెక్ పెడతారేమో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు