NTR Car : ఎన్టీఆర్ గ్యారేజ్ లోకి కొత్త కారు.. ఖరీదు తెలిస్తే ఫ్యుజులు ఔట్..!

NTR Car : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్ బాగా ఆకట్టుకున్నాయి.. ఇటీవల గోవాలో కూడా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది..వాస్తవానికి ఈ సినిమా ఈ నెలలోనే రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో అక్టోబర్ కి పోస్ట్ పోన్ చేశారు చిత్ర బృందం..

ఎన్టీఆర్ కార్ గ్యారేజ్ లో కొత్త కార్..

ఇదంతా ఇలా ఉండగా ఎన్టీఆర్ తాజాగా ఒక కొత్త కారు ( NTR Car ) కొన్నట్టుగా తెలుస్తోంది.. ఈ కార్ రిజిస్ట్రేషన్ కోసం నిన్నటి రోజున ఖైరతాబాద్ ఆర్డిఓ ఆఫీస్ కి వెళ్లారు.. ఇందులో ఎన్టీఆర్ బ్లాక్ టీ షర్ట్, కూలింగ్ గ్లాస్ ధరించి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.. ఎన్టీఆర్ తీసుకున్నటువంటి కొత్త కారు నోటిక్ బ్లూ లా కనిపిస్తోంది.. ఈ కారు విషయానికి వస్తే.. Mercedes-benz maybach S-class S580 అని తెలుస్తున్నది.. ఈ కారు విలువ సుమారుగా రూ.2.72 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అభిమానులు.

కార్ల ఇష్టాన్ని తగ్గించుకోవడం లేదా..

వాస్తవానికి ఎన్టీఆర్ కి కారులు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే తన దగ్గర ఎన్నో కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దేశంలోనే అత్యంత ఖరీదైన కార్లు కూడా ఎన్టీఆర్ దగ్గర ఉన్నాయట.. ఇప్పుడే ఎన్టీఆర్ గ్యారేజ్ లోకి మరొక బ్రాండెడ్ కార్ వచ్చి చేరింది.. అంతేకాదు మార్కెట్లోకి ఏదైనా ఒక కొత్త కారు వచ్చిందంటే చాలు దానిని కొనుగోలు చేయడానికి ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు. అందుకే ఇప్పటికే ఆయన కార్ గ్యారేజ్ చాలా కార్లు వచ్చి చేరాయి.

- Advertisement -

ఎన్టీఆర్ సినిమాలు..

ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. వార్ -2 సినిమాతో మొదటిసారి ఎన్టీఆర్ బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నారు.. ఇందులో ఎన్టీఆర్ తోపాటు హృతిక్ రోషన్ కూడా నటిస్తూ ఉన్నారు.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. యష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు.. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వార్-2 లో ఎన్టీఆర్, హృతిక్ మధ్య హై యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ చివరి వారంలో జూనియర్ ఎన్టీఆర్ వార్-2 సినిమాలో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం దాదాపుగా ఎన్టీఆర్ 50 రోజుల వరకు డేట్ లను కేటాయించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఉన్నటువంటి కొత్త కారుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు