Pushpa The Rule : పుష్ప2 ఆశలకు ‘సింగం’ పెద్ద అడ్డుగా మారనుందా?

Pushpa The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప ది రూల్ సినిమా కోసం అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప ది రైజ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. ముఖ్యంగా పుష్ప కోసం తెలుగు జనాలకంటే బాలీవుడ్ ప్రేక్షకులే ఎక్కువ ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే ఈపాటికే సినిమా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసేదేమో. కానీ సుకుమార్ పర్ఫెక్షన్ ప్లానింగ్ తో సినిమాను ఆలస్యం చేస్తున్నాడు. ఇటు ఫ్యాన్స్ కూడా ఆలస్యమైనా మూవీ శాటిస్ఫై చేస్తే చాలు అనుకుంటున్నారు. అయితే ఫైనల్ గా ఆగస్టు 15వ తేదీన ఖచ్చితంగా విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంది. పైగా ఈ సినిమా నుండి ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేసిన కూడా అందులో రిలీజ్ డేట్ ని కూడా ప్రత్యేకంగా హైలైట్ చేస్తోంది. కాబట్టి సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం లేదని ఫ్యాన్స్ ఒక నమ్మకంతో కనిపిస్తూ ఉన్నారు. అయితే పుష్ప 2 సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద తప్పకుండా 1000 కోట్ల మార్క్ ను అందుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారు.

పక్కా ప్లానింగ్ తో వెయ్యి కోట్ల టార్గెట్..

అయితే పుష్ప ది రూల్(Pushpa The Rule) సినిమాతో ఈసారి మేకర్స్ ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్ళని టార్గెట్ గా పెట్టుకున్నారు. సినిమాకి కూడా ఆ రేంజ్ హైప్ ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ సుకుమార్ అండ్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. పైగా మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకడకుండా సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే బడ్జెట్ రెండొందల కోట్లు దాటింది. ఇటు మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో కూడా అసలు తగ్గడం లేదు. ముఖ్యంగా మేకర్స్ ఫోకస్ తెలుగు రాష్ట్రాల్లో కంటే బాలీవుడ్ పైనే ఎక్కువ ఉంది. అయితే సినిమా 1000 కోట్ల మార్క్ ను అందుకోవాలి అంటే పోటీగా పెద్ద సినిమాలు ఏమీ రాకూడదు. అన్నిటికి మించి అన్ని భాషల ఆడియన్స్ ఆదరణ సినిమాకి ముఖ్యం. అయితే తాజాగా పుష్ప2 సినిమాకు బాలీవుడ్ లో ఒక గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని అర్థమవుతుంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ సింగం సిరీస్ లో భాగంగా వస్తున్న ‘సింగం అగైన్’ ప్రాజెక్టు ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతొంది.

పుష్ప 1000 కోట్ల ఆశలపై సింగం గండం..

అజయ్ దేవగన్ సింగం సిరీస్ బాలీవుడ్ లో ఎలాంటి సక్సెస్ సాధించాయో తెలిసిందే. అయితే సింగం అగైన్ సినిమాకు డైరెక్టర్ రోహిత్ శెట్టి అని అతని మసాలా యాక్షన్ కామెడీ ఈసారి వర్కౌట్ కాదు అని టాలీవుడ్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టును అంత తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. అజయ్ దేవగన్ రోహిత్ శెట్టితో ఇప్పటికే 10 సినిమాలు చేశాడు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన గోల్ మాల్ ఫ్రాంచైజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక సింగం సిరీస్ ఓ రేంజ్ లో హిట్ అయింది. అంతేకాకుండా అజయ్ దేవగన్ టైమ్ కూడా ఇప్పుడు బాగానే నడుస్తోంది. రీసెంట్ గా నటించిన సైతాన్ సినిమా యావరేజ్ టాక్ అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. కాబట్టి ఈ సింగం కాంబినేషన్ ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.

- Advertisement -

అయితే ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం పోటీ వచ్చినా పుష్ప2 హిట్ అయ్యే అవకాశం ఉన్నా, పుష్ప ది రూల్ 1000 కోట్ల మార్క్ అందుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా బాలీవుడ్ లో పోటీగా ఉండకూడదు. అలా అయితేనే పుష్ప 2 సినిమా ఆ రేంజ్ రీచ్ అవుతుంది. కాబట్టి పోటీలో బలంగా నిలవాలి అంటే ప్రమోషన్స్ కూడా అంతకుమించి అనేలా ఉండాలి. అప్డేట్స్ కూడా ఓపెనింగ్స్ కు ఉపయోగపడాలి. అయితే రిలీజ్ టైం వచ్చేసరికి సింగం పోటీ నుండి తప్పుకునే అవకాశం కూడా లేకపోలేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పుష్ప2 రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ ఇంకా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు