Pushpa The Rule : షూటింగ్ ఇంకా అంత బాకీ ఉందట? అయినా ఫుల్ కాన్ఫిడెన్స్ తో టీమ్!

Pushpa The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప ది రూల్ వరుస షెడ్యూల్స్ తో షూటింగ్ నిర్విరామంగా జరుగుతూ ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా వైడ్ గా ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో చేరాలని మేకర్స్ కూడా తహతహలాడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప ది రైజ్ కి రెండో భాగంగా వస్తున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ లో నటిస్తున్న సగానికి పైగా ఆర్టిస్టులు ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పుష్ప ది రైజ్ రిలీజ్ అయ్యాక దాదాపు ఏడాది తర్వాత మొదలైందన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఈ సినిమా షూటింగ్ ఫినిష్ కావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని తెలుస్తుంది. పైగా పుష్ప ఫస్ట్ పార్ట్ ని మించి రెండో పార్ట్ పై పది రెట్లు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకోవాలంటే మేకర్స్ ఎంత కృషి చేయాలో తెలిసిందేగా.

షూటింగ్ మాత్రం అంత బాకీ?

అయితే సినిమా మేకర్స్ ఆడియన్స్ అంచనాలను అందుకోవడానికి హై స్థాయిలోనే కష్టపడుతున్నారు. పైగా మార్కెటింగ్ కూడా సుకుమార్ తన స్టైల్ లో బాగానే చేస్తున్నాడు. కేవలం ఒక్క పోస్టర్ వదిలి మూవీపై అంచనాలను పెంచడం అంటే మామూలు విషయం కాదు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం పుష్ప ది రూల్ షూటింగ్ ఇంకా 30 శాతం వరకు బాకీ ఉందని తెలుస్తుంది. షూటింగ్ ఏడాదికి పైగా కాలంగా జరుగుతున్నా, ఇంకా ఫినిష్ అవ్వలేదంటే ఫ్యాన్స్ అనుకున్న టైం కి వస్తుందా లేదా అన్న సందేహంలో ఉన్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం తమ సినిమా ని అనుకున్న సమయానికి పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేస్తామని ధీమాగా ఉన్నారు. పైగా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటూ మూవీని జనాల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.

టైం కి పూర్తి చేస్తామని హామీ?

అయితే పుష్ప ది రూల్ సినిమా సమయానికి పూర్తి చేస్తామని మేకర్స్ నుండి సమాచారం వస్తుంది. దానికి తాము మొదటి పార్ట్ ని రిలీజ్ చేసిన విధానాన్నే గుర్తుకు తెస్తున్నారు. అప్పట్లో పుష్ప ది రైజ్ సినిమా (Pushpa The Rise) కి రిలీజ్ కి ముందు దాదాపు 30 షూట్ రోజులు మిగిలి ఉన్నాయి, మరియు విడుదలకు దాదాపు 40 రోజుల సమయం ఉంది. కానీ అనూహ్యంగా సుకుమార్ అల్లుఅర్జున్ మరియు అతని టీం అనుకున్న సమయానికి ముందే పూర్తి చేసి డిసెంబర్ 17, 2021న విడుదల చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే ఇప్పుడు Pushpa The Rule షూట్ కూడా 70% పూర్తి కాగా, అదే కాన్ఫిడెన్స్ తో అనుకున్న సమయానికి ముందే పూర్తి చేసి మళ్లీ ఆగస్ట్ 15, 2024న సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. ఇక ఈ సినిమా నుండి తాజాగా టీజర్ అప్డేట్ కూడా రావడం జరిగింది. అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా ఏప్రిల్ 8న పుష్ప ది రూల్ టీజర్ రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడం జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు