RC 16 : చరణ్ మూవీలో సూపర్ స్టార్? ఇదెక్కడి ట్విస్ట్..

RC 16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టి మరింత బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. RRR తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం కావడంతో, పైగా శంకర్ చాలా ఏళ్ళ తర్వాత తెరకెక్కిస్తున్న పొలిటికల్ డ్రామా కావడంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా విపరీతమైన అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ 80 శాతం వరకూ పూర్తైంది. జులై కల్లా గేమ్ ఛేంజర్ ని పూర్తి చేసి వచ్చే అక్టోబర్‌లో విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇక దీని తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన తో రామ్ చరణ్ తన 16వ సినిమాను చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ప్రకటన లాస్ట్ ఇయర్ చాలా రోజుల క్రితమే వెలువడింది. కానీ స్క్రిప్ట్ డెవలప్మెంట్ వల్ల ఆలస్యం చేసారు.

సమ్మర్ లో సాలిడ్ గా మొదలై..

ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో లో వస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. దీనికి మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. ఇక పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను బుచ్చిబాబు శర వేగంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్టును రెడీ చేయడంతో పాటు టెక్నికల్ గా మిగిలిన అన్ని పనులను సెట్ చేసేశాడు. సమ్మర్ లో ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా 70స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని మేకర్స్ ఇంతకు ముందే చెప్పడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే మేకర్స్ నుండి సమాచారం వచ్చింది. ఇక ఈ సినిమాలో చరణ్ ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై మేకర్స్ నుండి ఎటువంటి క్లారిటీ రాలేదు. మొత్తానికి ఈ సినిమా మాత్రం ఓ క్రీడాకారుడి కథతోనే రాబోతుందని తెలుస్తోంది. అయితే పాన్ ఇండియా రేంజ్ లో భారీగా తెరకెక్కబోయే ఈ సినిమా లో పాన్ ఇండియా స్టార్లతో హై రేంజ్‌ కాన్సెప్టుతో వస్తుంది.

చరణ్ తో బిగ్ బి?

ఇక RC16 సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ ఇందులో విలన్‌ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ ను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్ర కోసం కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను కూడా ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం ఆయనే ఒక ఇంటర్వ్యూ లో రివీల్ చేసారు. అయితే తాజగా ఈ మెగా ప్రాజెక్ట్ లో బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నారని నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో చరణ్ కి తాతయ్య గా అమితాబ్ నటించనున్నారని,తాత మనవళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని కూడా పలు వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఇప్పటికే బుచ్చిబాబు స్టోరీని వినిపించగా.. వెంటనే ఓకే చేశారట. త్వరలోనే దీన్ని రివీల్ చేస్తారని సమాచారం. ఇక చరణ్ (RC 16) మూవీలో బిగ్‌బీ క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఎంతో మంది బడా స్టార్లు భాగం అయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీ గా ఉండగా ఏప్రిల్ చివరి వారంలో RC16 రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందని సమాచారం.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు