Tillu Square : మేకర్స్ అతనిని విస్మరించారా?

Tillu Square : టిల్లు స్క్వేర్ థియేటర్ల దగ్గర తన సత్తా చూపిస్తున్నాడు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అంటే టిల్లు స్క్వేర్ సినిమా అనే చెప్పాలి. టాలీవుడ్ లో టిల్లు స్క్వేర్ ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ సినిమా తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తున్న సినిమాగా నిలుస్తోంది. నిజానికి మధ్యలో కొన్ని సినిమాలు హిట్ అయినా అవి ఓ మోస్తరు విజయాలే కావడం గమనార్హం. అయితే మార్చ్ 29న విడుదలైన టిల్లు స్క్వేర్ మాత్రం భాయ్ అంచనాలతో విడుదలై ఆ అంచనాలని కూడా మించి ఆశ్చర్యకరంగా ఇంత సమ్మర్ వేడిలోనూ కూల్ గా పైగా వీక్ డేస్ లో ఆక్యుపెన్సీలు బాగుండటం పట్ల ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా ఇంకా వారం తిరక్కుండానే నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం డెబ్భై కోట్ల గ్రాస్ దాటడం చిన్న విషయం కాదు. ఇక రెండో వీకెండ్ పూర్తయ్యే సరికి దాదాపు వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక మాత్రం చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్ లలో, సక్సెస్ మీట్ లలో క్రెడిట్ దాదాపుగా సిద్ధూయే తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది.

అతని కష్టం ఎంతో ఉంది?

అయితే రీసెంట్ గా టిల్లు స్క్వేర్ (Tillu Square)సినిమా విజయంలో చాలా మంది ఫోకస్ ఎక్కువగా సిద్దు జొన్నలగడ్డ మీదకు వెళ్తోంది, కానీ దర్శకుడు మల్లిక్ రామ్ కష్టాన్ని కూడా విస్మరించికూడదు అని ఆడియన్స్, మేకర్స్ గుర్తించుకోవాలి. ఇండస్ట్రీ లో అవగాహన లేని వాళ్ళు ఇది అతని తొలి చిత్రంగా పొరపాటు పడుతున్నారు. కానీ మల్లిక్ రామ్ దాదాపు పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కోసం పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడెప్పుడో 2016 లో సుమంత్ హీరోగా ‘నరుడా డోనరుడా’ చేశాడు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ విక్కీ డోనర్ రీమేక్ గా రూపొందిన ఈ ఎంటర్టైనర్ మన ఆడియన్స్ కి అంతగా ఎక్కలేదు. అయితే 2021లో తేజ సజ్జతో ‘అద్భుతం’ సినిమా చేశాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా, డైరెక్ట్ గా ఓటిటి రిలీజ్ దక్కించుకోవడంతో ప్రేక్షకులకు రీచ్ అంతగా రాలేదు. ఇవే గాక ఇతని లిస్టులో తరగతిగది దాటి, పెళ్లి గోల వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. అవి కూడా మంచి టాక్ తెచ్చుకున్నా అవి మల్లిక్ రామ్ ని దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి పెద్దగా సహకరించలేదు.

మల్లిక్ రామ్ కష్టం!

అయితే రీసెంట్ గా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్ విజయం లో అతడి కష్టం ఎంతో ఉందని చెప్పొచ్చు. మల్లిక్ రామ్ గత సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, టిల్లు స్క్వేర్ ఇచ్చిన ప్రమోషన్ చాలా పెద్దదని చెప్పొచ్చు. అయితే డీజే టిల్లుని హ్యాండిల్ చేసిన దర్శకుడిని కాదని మల్లిక్ రామ్ కు ఛాన్స్ ఇవ్వడం పట్ల కూడా తొలుత పరిశ్రమ వర్గాల్లో ఏవేవో గుసగుసలు వినిపించాయి. ఎందుకంటే సీక్వెల్ ఏ మాత్రం అటు ఇటు అయినా చెడ్డ పేరు వచ్చేది మల్లిక్ రామ్ కే. స్క్రిప్ట్ లో తీసుకున్న శ్రద్ధ, అలాగే సిద్దుతో కలిసి రైటర్స్ టీమ్ నుంచి బెస్ట్ రాబట్టుకున్న విధానం థియేటర్లలో బాగా నవ్వులు పూయించింది. ఫైనల్ గా ఎదురుచూపులకు బ్రేక్ వేసింది. టిల్లు స్క్వేర్ తర్వాత దర్శకుడు మల్లిక్ రామ్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. ఇక తర్వాత రాబోయే మూడో పార్ట్ టిల్లు క్యూబ్ మల్లిక్ రామే చేస్తాడా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ టిల్లు స్క్వేర్ సక్సెస్ లో, ప్రమోషన్స్ లో మేకర్స్ దర్శకుడు మల్లిక్ రామ్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలని ట్రేడ్ విశ్లేషకులు, నెటిజన్లు భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు