Tillu Square Collections : కలెక్షన్స్ నిజంగానే వచ్చాయా, నిర్మాత కామెంట్ వలన పోస్టర్స్ రెడీ చేస్తున్నారా.?

Tillu Square Collections : కాలం మారుతున్న కొద్ది పరిస్థితులు మారుతాయి అంటారు. ఇక సమాజంలో చాలా మార్పులు వచ్చినట్లు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా సంభవించాయి. ఇప్పుడు సినిమాను చూసే విధానం, తీసే విధానం కూడా మారిపోయింది. ఒకప్పుడు ఒక హీరో నుంచి ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ అయితే ఇప్పుడు మాత్రం రెండేళ్లకు ఒకసారి ఆ హీరో సినిమా రిలీజ్ అవుతుంది. ఇకపోతే ఒకప్పుడు సినిమా అంటే ఒక కథ, స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన డైలాగ్స్ ఇలా చాలా ఉండేవి. కానీ ఇప్పుడు అదంతా లేదు. కొందరు మాత్రం సినిమా అంటే కేవలం థియేటర్లో కూర్చున్న ఆడియోన్ ను ఎంటర్టైన్ చేస్తే చాలు అని ఫీల్ అవుతున్నారు.

థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తే చాలు అనేది కూడా కొన్ని సినిమాలు ద్వారా ప్రూవ్ అయితే వచ్చింది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన కొన్ని సినిమాలను చూసుకుంటే ఒక మామూలు కథను మంచి ఫన్ డైలాగ్స్ తో చెప్పి సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక ఇన్సిడెంట్ తో కథని క్రియేట్ చేసి మంచి డైలాగ్స్ రాసి హిట్టు కొట్టిన సినిమాలు రీసెంట్ టైమ్స్ లో బాగా వస్తున్నాయని చెప్పవచ్చు. అనుదీప్ కె.వి దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ముగ్గురు ఇన్నోసెంట్ కుర్రాళ్ళు ఒక ఇన్సిడెంట్ లో ఇరుక్కుపోతే దాని నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఆ సినిమా కథ. దానిని మంచి ఫన్ డైలాగ్స్ తో తెరకెక్కించి రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కలెక్ట్ చేసింది.

ఇకపోతే రీసెంట్ గా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మ్యాడ్ సినిమా కూడా అలాంటిదే అని చెప్పొచ్చు. కాలేజీలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ని తీసుకొని దాని ద్వారా ఒక ట్విస్ట్ ను ఆడ్ చేసి సినిమాని మంచి ఫన్ డైలాగ్స్ తో రన్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిసేలా చేశారు. సిద్దు జొన్నలగడ్డ రాసిన డీజె టిల్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇకపోతే సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ 29న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా పడిన మొదటి షో నుంచి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఈ సినిమాకు వస్తుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను కొనసాగిస్తుంది.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ని కూడా అదే రోజు నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ ఈ సినిమా దాదాపు 100 కోట్లు వసూలు చేస్తుంది అని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమా నేటికీ దాదాపు 45.3 కోట్ల వరకు కలెక్షన్స్ ( Tillu Square Collections ) సాధించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఈ కలెక్షన్స్ నిజంగా వచ్చాయా లేదంటే 100 కోట్లు సినిమా చేస్తుంది అనే నాగ వంశీ అన్నాడు కాబట్టి ఈ విధంగా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారా.? అని కొందరికి కొత్త అనుమానాలు వస్తున్నాయి.

ఏదేమైనా సిద్దు జొన్నలగడ్డ ఈ టిల్లు స్క్వేర్ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించాడు అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల్ని ఎక్కడ నిరాశపరచలేదు. మొత్తానికి ఈ సినిమాలో టిల్లు సినిమాను మించిన కథ ఉందని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు