Dil Raju : ఆర్య సినిమాకి పనిచేసిన అందరూ ఈరోజు వేరే లెవెల్ లో ఉన్నారు

Dil Raju : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన కొన్ని సినిమాలకి ఎప్పటికీ ఒక కల్టి క్లాసిక్ స్టేటస్ ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఎన్నో రికార్డును కూడా సృష్టించాయి. అద్భుతమైన కలెక్షన్స్ ని కూడా కొల్లగొట్టాయి. ఇక ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కొన్ని సినిమాలకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన చాలా సినిమాలలో ఆర్య సినిమా ఒకటి.

ఆర్య సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పుడు ఆర్య సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు వేరే రేంజ్ లో ఉన్నారు అని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక కొత్త దర్శకుడు పరిచయం అయ్యాడు. ఆ దర్శకుడు నేడు ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి చూపించాడు. ఆ దర్శకుడే తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన సినిమాలను తెరకెక్కించాడు. ఆ దర్శకుడే తగ్గేదేలే అంటూ తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచే పనిలో ఉన్నాడు.

ఈ సినిమా అల్లు అర్జున్ కి స్టార్ డం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతో కొద్దిపాటి విమర్శలు ఎదుర్కొన్న అల్లు అర్జున్ కి ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించి మంచి పేరును తీసుకొచ్చింది. అల్లు అర్జున్ లో ఒక పరిపూర్ణమైన నటుడుని బయటికి తీసిన సినిమా ఆర్య. ఒక ప్రేమ కథను ఇలా కూడా చెప్పొచ్చు.అసలు వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది అని తెలుగు తెరకు పరిచయమైంది ఈ సినిమా వల్లనే. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ ప్రస్తుతం అందుకోలేని స్థాయిలో ఉన్నారు.

- Advertisement -

ఈ సినిమాకి సంబంధించి దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ పెద్ద ప్లస్. ఇప్పటికీ కూడా ఆ పాటలు విన్న ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుంది. కేవలం సాంగ్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకి అందించాడు దేవి శ్రీ ప్రసాద్. కొన్నిసార్లు ఒక దర్శకుడు సంగీత దర్శకుడు అన్ని సినిమాలకు కలిసి పనిచేసే అవకాశం కుదరకపోవచ్చు. కానీ సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ మాత్రం చేసిన ప్రతి సినిమాకు ఇద్దరు కలిసే వర్క్ చేస్తారు. మిగతా దర్శకులు కంటే కూడా దేవిశ్రీప్రసాద్ సుకుమార్ సినిమాలకి ఇచ్చే సంగీతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.

కేవలం హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు మాత్రమే కాకుండా ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కూడా అద్భుతమైన ప్లస్ అయింది. ఈ సినిమాకి పనిచేసిన చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా నేడు టాప్ పొజిషన్లో ఉన్నారని చెప్పొచ్చు. ఈ సినిమా మే 7 తో దాదాపు 20 ఏళ్ళను పూర్తి చేసుకుంటుంది దీనికి సంబంధించి ఒక ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇదే విషయం చాలా కథనాల్లో వినిపించింది. అయితే దీని గురించి ప్రత్యేకమైన క్లారిటీ కూడా ఇచ్చారు రాజు.

ప్రస్తుతం దిల్ రాజు లవ్ మీ అనే సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇదివరకే మాట్లాడుతూ ఇది ఒక ఆర్య లాంటి సినిమా అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్య సినిమా ప్రస్తావన తీసుకొస్తూ ఆర్య సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ ని నిర్వహించనున్నట్లు దిల్ రాజు అనౌన్స్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు