Jai HanuMan Update : హనుమాన్ చిన్న సినిమా, జై హనుమాన్ హాలీవుడ్ రేంజ్ సినిమా

Jai HanuMan Update : ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చాయి. కానీ, అందరి చూపు ఓ చిన్న సినిమాపైనే ఉన్నాయి. అదే హనుమాన్. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా, థియేటర్ లో మాత్రం హనుమాన్ దుమ్ము దులిపింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద 300 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్ అనే మూవీ రాబోతుందని అందరికీ తెలిసిందే.

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ను మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. హనుమాన్ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్ర చేశాడు. కానీ, ఇప్పుడు జై హనుమాన్ మూవీలో స్టార్ హీరోల ఎంట్రీ ఉండబోతుందని సమాచారం. హనుమాన్ పాత్ర కోసం ఒక పెద్ద హీరోతో ఇప్పటికే చర్చలు పూర్తి అయినట్టు తెలుస్తుంది. ఆ హీరో పేరును ప్రశాంత్ వర్మ కానీ, జై హనుమాన్ టీం కానీ, ఇప్పటి వరకు రివీల్ చేయ్యడం లేదు.

ఇకపోతే ప్రశాంత్ వర్మకి మంచి పేరుని తీసుకొచ్చింది హనుమాన్ సినిమా. ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ ఎన్ని సినిమాలు తెరకెక్కించిన కూడా హనుమాన్ సినిమాతో అందరికీ సుపరిచితమైపోయాడు ఈ దర్శకుడు. తన సినిమాతో థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యేలా సక్సెస్ అయ్యాడు. అలానే 50 రోజుల పోస్టర్లు చూసి చాలా రోజులవుతున్న తరుణంలో మళ్లీ హనుమాన్ సినిమాకి 50 రోజులు పోస్టర్లు దర్శనం ఇచ్చాయి. ఇకపోతే ఈ సినిమా అంచనాలను పెంచింది కాబట్టి జై హనుమాన్ సినిమాను మరింత రేంజ్ లో తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.

- Advertisement -

అయితే హనుమాన్ సినిమా ముందు వరకు కూడా సరైన ఆదరణ దక్కలేదు. థియేటర్లు కూడా ఈ సినిమాకు అనుకున్న రేంజ్ లో రాలేదు. హైదరాబాద్ లో కేవలం ఐదు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రమే ఈ సినిమాకు ఇచ్చారు. ఆ తర్వాత సినిమా పాజిటివ్ టాక్ వలన, ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన మిగతా సినిమాల నెగిటివ్ టాక్ రావడం వలన ఈ సినిమా పాజిటివ్ ముందుకు దూసుకెళ్లింది. దీన్ని అందరూ ఒక చిన్న సినిమాలాగానే ట్రీట్ చేశారు. కానీ ఇప్పుడు ఇది హాలీవుడ్ రేంజ్ సినిమాగా ట్రీట్ చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ.

చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ హలాంగ్ బే ఈ సినిమాను షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదివరకే హాలీవుడ్ సినిమాలు అయినా కింగ్ కాంగ్ స్కల్ ఐలాండ్, కింగ్ Vs గాడ్జిల్లా తో పాటు చాలా సినిమాలు ఈ ప్లేస్ లో షూటింగ్ చేశారు. హనుమాన్ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయినప్పుడే ప్రశాంత్ అన్న టాలెంట్ ఇంటి అనేది చాలామందికి అర్థమయింది. సరిగ్గా అదే టైంలో ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవ్వటం ఆ గ్రాఫిక్స్ సరిగా ఆకట్టుకోకపోవడం వలన ఈ సినిమాకి అది బాగా కలిసి వచ్చింది.

ఇకపోతే హనుమాన్ సినిమా గ్రాఫిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లో చాలామంది చిన్న పిల్లలకు నచ్చటమే కాకుండా పెద్దవాళ్లను కూడా అద్భుతంగా ఆకట్టుకుంది ఆ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్. ఇకపోతే ఇప్పుడు రియల్ లొకేషన్స్ లో కూడా జై హనుమాన్ సినిమాను షూట్ చేసే ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఏదేమైనా హనుమాన్ చిన్న సినిమా అయితే ఇప్పుడు రాబోతున్న జై హనుమాన్ సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్నట్లు ప్రశాంత్ వర్మ చేస్తున్న పనులు చూస్తే అర్థమవుతుంది. రీసెంట్ గా అంజనాద్రి 2.0 ఓ అంటూ ఒక వీడియోను కూడా విడుదల చేశాడు ప్రశాంత్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు