Tillu Square Dialogues : టిల్లు గాడు ఇంత పేలడానికి సిద్దు ఒక్కడే కాదు… తెరవెనుక మరో స్టార్ రైటర్

Tillu Square Dialogues : టిల్లు స్వ్కేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. మొదటి షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తుంది. రెండో రోజుతో ఈ సినిమా 45.3 కోట్ల షేర్ రాబట్టిందని పోస్టర్ రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు. అయితే సినిమాలో టిల్లు పాత్ర చాలా హైలెట్ అవుతుంది. నిజానికి డిజే టిల్లు సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. హీరోయిన్ కు గానీ, చుట్టు ఉన్న ఇతర పాత్రలకు గానీ చాలా తక్కువ ప్రాధాన్యత, డైలాగ్స్ ఉంటాయి. కానీ, టిల్లు స్వ్కేర్ మూవీలో మాత్రం హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ, సిద్ధు జొన్నలగడ్డ డామినేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి కారణం… సినిమాలో హీరోకు ఉన్న డైలాగ్స్ అని చెప్పొచ్చు.

సినిమాకు డైలాగ్స్ గానీ, స్టోరీ గానీ రాసింది సిద్దు జొన్నలగడ్డనే అని అందరికీ తెలుసు. కానీ, సిద్ధుతో పాటు మరో రైటర్ కూడా ఉన్నాడు. అతనే రవి ఆంటోని. రవి ఆంటోని అంటే చాలా తక్కువ మందికి తెలుసు. కానీ, మ్యాడ్ సినిమాలో ఆంటోని అనే పాత్రతో అందరికీ తెలుసు. మ్యాడ్ సినిమాలో మురళీధర్ గౌడ్‌తో వచ్చిన ఓ సన్నివేశం, కాలేజ్ హాస్టల్‌లో ర్యాగింగ్ టైమ్‌లో ట్యూబ్ లైట్‌ చేతిలో పట్టుకుని చేసిన కామెడీ కానీ, ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ సినిమాలో ఆంటోని రోడ్రిగ్జ్ పాత్ర చేసిన నటుడే ఈ రైటర్ రవి ఆంటోని.

రవి ఆంటోని – సిద్ధు జొన్నలగడ్డ రైటింగ్ కాంబోలో వచ్చిన డైలాగ్స్ ( Tillu Square Dialogues ) కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. టిల్లు స్వ్కేర్‌కు మూవీ డైలాగ్స్ పరంగా మంచి పేరు రావడంతో వీళ్ల కాంబినేషన్‌లో టిల్లు స్వ్కేర్ కు సీక్వెల్‌గా రాబోతున్న టిల్లు క్యూబ్ మూవీపై కూడా ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. ఈ టిల్లు క్యూబ్ కూడా హిట్ అయితే రవి ఆంటోనికి రైటర్ గా ఇండస్ట్రీలో వరుసగా ఛాన్స్ లు వచ్చే ఛాన్స్ ఉంది. రైటరింగ్ తో పాటు రవి ఆంటోని మంచి నటుడిగా కూడా పేరు ఉంది. గతంలో మ్యాడ్ మూవీలో ఆంటోని రోడ్రిగ్జ్ పాత్రలో కనిపించిన రవి ఆంటోని కామెడీ టైమింగ్ కు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

కాగా, సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ టిల్లు స్వ్కేర్ మూవీ ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది. వరుసగా సెలవులు ఉండటంతో కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. నిర్మాత నాగ వంశీ ఓ సందర్భంలో 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. రెండో రోజుకే ఈ మూవీ 45.3 కోట్లు వసూళ్లు చేసింది అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే నిర్మాతలు చెబుతున్న దాని ప్రకారం టిల్లు స్వ్కేర్ మూవీ 100 కోట్ల మార్క్ అందుకోవాలంటే, మరో 55 కోట్లు రావాలి. ప్రస్తుతం ఉన్న హైప్ చూస్తే అది కొద్ది రోజుల్లోనే జరిగేలా ఉందని క్రిటిక్స్ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు