Actress Sukanya : ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. కానీ ఇప్పుడేమో..!

Actress Sukanya : సినీ పరిశ్రమ అనేది ఒక రంగుల ప్రపంచం వంటిది.. అందం, అభినయంతో ఆకట్టుకున్నప్పటికీ కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి.. లేకపోతే ఎక్కడ కూడా సక్సెస్ కాలేం.. అలా అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వారు చాలామంది ఉన్నారు.. అలాంటి వారిలో నటి సుకన్య కూడా ఒకరు.. ఈమె తెలుగు , తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె తమిళ నిర్మాత రమేష్ కూతురు..

1991లో భారతీ రాజా డైరెక్షన్లో వచ్చిన పుదీనెల్లు పుదునాధు అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సుకన్య.. ఆ తర్వాత ఈమె ఎన్నో చిత్రాలలో నటించింది. నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమయింది. అటు సినీ కెరియర్ లో కూడా వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది సుకన్య.. 2002లో అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ శ్రీధర్ ను వివాహం చేసుకొని అక్కడే ఉండిపోయింది.. అయితే సంవత్సరంలోపే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

దీంతో ఇండియాకు తిరిగి వచ్చేసిన సుకన్య ( Actress Sukanya ) తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.. భాషతో సంబంధం లేకుండానే ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను బయటపెట్టింది.. అదేమిటి అంటే తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో ఎన్నో సినిమాలలో నటించాలని తాను ఎప్పుడూ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోలేదు. అలా అని సినిమాల నుంచి తప్పుకోలేదు .. తాను నటించిన ఎన్నో చిత్రాలకు అవార్డ్స్ కూడా వచ్చాయని తెలిపింది..

- Advertisement -

తన నటనను చూసి ప్రతి ఒక్కరు ప్రశంసించారు. అలా తనకి గుర్తింపు కూడా వచ్చింది కానీ వాటి గురించి ఎవరు మాట్లాడలేదు.. తాను సినిమాలలో నటించేందుకు సిద్ధంగానే ఉన్నానని తనకు కూడా కొన్ని అవకాశాలు ఇవ్వండి అంటూ తెలియజేసింది.. ప్రస్తుతం సుకన్య చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు