Daniel Balaji : డేనియల్ బాలాజీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?

Daniel Balaji : తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న డేనియల్ బాలాజీ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఈయనకు సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఈయన వివాహం ఎందుకు చేసుకోలేదు అనే విషయం గురించి ఇప్పుడు నెట్టింట ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారుతోంది.. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో డేనియల్ బాలాజీ.. వివాహ జీవితానికి తాను ఎందుకు దూరంగా ఉన్నారో అసలు విషయాన్ని వెల్లడించారు.. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదని కూడా కొన్ని కారణాలను తెలియజేశారు.. వాటి గురించి చూద్దాం.

అందుకే పెళ్ళి వద్దు..

డేనియల్ బాలాజీ ( Daniel Balaji ) ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అట.. అందులో ఐదుగురు సోదరులతో పాటు ఐదుగురు సోదరీమణులు కూడా ఉన్నారట. మొత్తానికి బాలాజీ తల్లిదండ్రులకు 11 మంది సంతానం కలరు.. అయితే ఇందులో వాళ్లంతా కూడా పెళ్లి చేసుకుని స్థిరపడినట్లు తెలుస్తోంది.. కానీ డేనియల్ బాలాజీ మాత్రం వివాహం చేసుకోలేదు.. తన 25 వ యేట తన తల్లి పెళ్లి చేసుకోమని చెప్పగా.. కుటుంబంలో అందరి పెళ్లిళ్లు అయ్యాక గొడవలు చోటు చేసుకోవడం , వారు పడుతున్న కష్టాలను చూసి వివాహం వద్దని అప్పుడే నిర్ణయించుకున్నారట.

పెళ్ళి అంటే బాధ్యత..

వివాహమైన తర్వాత భార్యా పిల్లలు, వాళ్లకోసం సంపాదన, అప్పులు .. అలాంటి జీవితం కోసం ఎన్నో తప్పులు, మోసాలను కూడా చేయవలసి ఉంటుంది.. ఇవన్నీ చేయడం తనకు ఇష్టం లేదని.. తన తల్లికి అర్థమయ్యేలా చెప్పి ఒప్పించారట.. అందుకే తాను పెళ్లి చేసుకోలేదని ఒక ఇంటర్వ్యూలో గతంలో తెలియజేశారు.. తాను సంపాదించిన డబ్బు మొత్తం కూడా ఒక గుడి కోసం ఎక్కువగా ఖర్చు చేసేవారట.. అలా ఆ గుడికి భక్తులతో పాటు తన తల్లి కూడా తరచూ వెళుతూ ఉండేవారట. ఆ గుడి పనుల వల్లే కేజిఎఫ్ సినిమాలో తనకు అవకాశం వచ్చినా వదులుకున్నాను అంటూ గతంలో వెల్లడించారు డేనియల్ బాలాజీ..

- Advertisement -

అందుకే కేజిఎఫ్ లో నటించలేదు…

ఈ విషయం తెలుసుకున్నాక కేజిఎఫ్ హీరో యష్ కూడా గుడి నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఆ గుడిని సందర్శించినట్లు సమాచారం.. అంతే కాకుండా డేనియల్ బాలాజీ , యష్ కు కూడా మంచి స్నేహబంధం ఉందట.. అందుకే కే జి ఎఫ్ సినిమాలో నటించమని స్వయంగా యష్ తనకు ఫోన్ చేసి మరీ అడిగారని.. కానీ తనకున్న పరిస్థితులను చెప్పి అందులో నటించలేనని చెప్పానని తెలియజేశారు.. ఆ కారణంగానే గుడికి సంబంధించిన పనులు కూడా పూర్తి అయిన తర్వాత యష్ ఆ గుడికి వెళ్ళినట్టుగా తెలియజేశారు. మొత్తానికైతే పెళ్లి అంటే భార్య పిల్లలు బాధ్యతలు ఆ తర్వాత వచ్చే సమస్యలు అన్నింటిని ముందే పసిగట్టి వాటిని ఎదుర్కోలేక ఆయన వివాహం చేసుకోలేదని వార్త తెరపైకి వచ్చింది ఏది ఏమైనా డేనియల్ బాలాజీ ఒంటరిగానే తన జీవితాన్ని ముగించేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు