Akkineni Akhil : కనుమరుగవుతున్న అక్కినేని హీరో అఖిల్..!

Akkineni Akhil : అక్కినేని నట వారసుడుగా అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు అవుతుంది. అయితే తాను చేసిన ఐదు సినిమాలలో కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప మిగతా ఏ సినిమా కూడా అంతగా తన కెరీర్ పై ప్రభావం చూపలేదు.. గత ఏడాది వచ్చిన ఏజెంట్ సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది. ఇక హీరోగా అఖిల్ తన కెరీర్ ని మొదలుపెట్టి ఇప్పటికి తొమ్మిదేళ్లు పూర్తి అయ్యింది.. కానీ అఖిల్ ఇప్పటికీ ఒక సాలిడ్ హిట్ ను మాత్రం అందుకోలేకపోతున్నారు.

అఖిల్ కెరియర్..

తనను తాను ప్రతి సినిమాతో బలంగా ప్రూవ్ చేసుకోవాలనే కసితో సినిమా తీస్తున్నప్పటికీ ఆ సినిమాలు ఎక్కడో ఒకచోట తేడా కొడుతూ ఉన్నాయి. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ ( Akkineni Akhil ) మళ్ళీ ఎలాంటి సినిమా కూడా చేయలేదు.. దీంతో ఫాన్స్ సైతం చాలా అసంతృప్తితో ఉన్నారు. గతంలో హోం భలే ప్రొడక్షన్లో ఒక సినిమా ఉంటుందంటూ.. అది కూడా భారీ బడ్జెట్ తో రాబోతోందంటూ వార్తలు వినిపించాయి.. కానీ ఆ సినిమా గురించి కూడా ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ రాలేదు.. దీంతో అఖిల్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ఉగాదికి వస్తుందని అభిమానులైతే భావిస్తున్నారు..

అలాంటి జానర్ అయితే సక్సెస్ పక్కా..

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే అఖిల్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు.. సినిమా మొదలు పెట్టకపోయినా పర్లేదు కనీసం కాంబినేషన్ లో అయినా అనౌన్స్మెంట్ చేస్తే కాస్త హ్యాపీగా అభిమానులు ఫీల్ అవుతారని అక్కినేని అభిమానులు తెలుపుతున్నారు.. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి సినిమా ఏంటన్నది ఆరోజు రివీల్ చేసే అవకాశం కాస్త ఎక్కువగానే ఉండవచ్చు అని అభిమానులు నమ్ముతున్నారు. అంతేకాదు అఖిల్ అభిమానులు మాత్రం ఒక పీరియాడికల్ డ్రామా, థ్రిల్లర్ చిత్రంలోనైనా నటించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతము ఇదే ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో అలాంటి జానర్లో అయితే కచ్చితంగా సక్సెస్ అవుతారని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు..

- Advertisement -

కష్టపడితే కాదు బుద్ధి పెట్టాలి..

ఇకపోతే ఏజెంట్ కోసం ఎన్నో ఏళ్ళు కష్టపడిన అఖిల్ భారీ యాక్షన్స్ సన్నివేశాలు కూడా చేశారు.. ఇన్ని చేసినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కష్టపడే తత్వం ఉన్నప్పటికీ కథనం విషయంలో ఆచితూచి అడుగులు వేయలేకపోతున్నారు అఖిల్. ముఖ్యంగా తన క్యారెక్టర్ పై పెట్టేటువంటి శ్రమ కథ మీద పెట్టడం లేదని.. దీంతో సినిమా అవుట్ పుట్ ఎలా ఉన్నప్పటికీ స్టోరీ బాగా లేకపోతే సినిమా ఫ్లాప్ అవుతుందని అభిమానులు తెలుపుతున్నారు. అందుకే కథల విషయంలో కచ్చితంగా ఆచితూచే అడుగులు వేయాలని ముఖ్యంగా తన తండ్రి సలహాలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. మరి అభిమానుల సలహాలను అఖిల్ దృష్టిలో పెట్టుకొని మరి ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి మరి. ఈసారి వచ్చే సినిమా జాక్పాట్ కొట్టాలని కూడా కోరుకుంటూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు