Prithviraj Sukumaran : 700 గొర్రెలు.. అందులో నేను గొర్రెనే.. ఆడు జీవితం..!

Prithviraj Sukumaran : హీరో పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఆడు జీవితం.. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి హిట్ టాకుతో దూసుకుపోతోంది.. ఎడారిలో చిక్కుకున్నటువంటి నజీబ్ తిరిగి తన సొంత దేశానికి ఎలా చేరుకున్నారనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం కాదని బెన్వమిన్ రచించారు.. పుస్తకంలోని కొన్ని అంశాలను ఆధారంగా తీసుకొని.. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అసలు నజీబ్ జీవితంలో జరిగిన సంఘటన విషయానికి వెళ్తే..

కేరళలోని అలెప్పి దగ్గర చిన్న గ్రామంలో నజీబ్ కుటుంబం ఉండేదట.. ఈ కుటుంబ పోషణ కోసం దేశం వదిలి సౌదీ వరకు వెళ్లారట. ఏజెంట్ నజీబ్ కి ఒక మాలులో పని అని చెప్పి అతనిని మోసం చేసి అక్కడి నుంచి తీసుకువెళ్లారట.. సౌదీ ఎయిర్పోర్ట్లో దిగగానే నజీబ్ కష్టం మొదలయింది.. దాదాపుగా రెండు రోజులపాటు ఎయిర్పోర్ట్ పరిసరాలలో తిరిగిన తర్వాత తాను మోసపోయానని గ్రహించాడు.. అలా సౌదీ లో ప్రవేశించిన నజీబ్.. ఒక అరబ్ షేక్ దగ్గరకు చేరుకుంటారు.. ఎడారిలో ఆ షేక్ పెద్ద షెడ్డు వేసుకొని 700 గొర్రెలను సైతం మేపుతూ ఉంటారు..

అక్కడ పనిలోకి చేరిన తర్వాత నజీబ్ జీవితమే మారిపోతుంది.. స్నానానికి కూడా నీరు ఉండవు. ఉండడానికి కూడా నీడ దొరకదు.. కేవలం ఆ షేక్.. నజీబ్ బతకడం కోసం కొన్ని రొట్టె ముక్కలను వేస్తూ ఉంటారు.. ఆ రొట్టె ముక్కలను గొర్రె పాలతో తడిపి తినేవారు. అక్కడి యజమాని తమ్ముడు తప్ప ఆ ప్రాంతంలో ఎవరు కనిపించే వారు కాదు. ఒకవేళ కనిపించినా అక్కడ అరబిక్ భాష తప్ప మరొక భాష కూడా ఎవరు మాట్లాడరు.. నజీబ్ ఏడ్చినప్పుడల్లా తనని కొట్టి ఎక్కువగా హింసించే వారట.

- Advertisement -

అప్పటికే నజీబ్ ఎడారి కి బానిస అయ్యారు. గొర్రెల మధ్య తాను కూడా ఒక గొర్రె అని భావించి రెండేళ్ల పాటు అలాగే జీవచ్ఛవంలా బతికారు.. అయితే అనుకోకుండా ఒకరోజు అన్నదమ్ములు ఇద్దరు కూడా పెళ్లికి వెళ్తారు.. అది అదునుగా నజీబ్ భావించి అక్కడి నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తారు..అయితే ఎటు చూసినా ఎడారే.. ఎటు వెళ్ళాలో తెలియక సతమతమవుతున్న సమయంలో అక్కడ ఒక మలయాళీ కనిపించి దారి చెబుతాడట.. అతడు కూడా అలాంటి పరిస్థితులలో ఉండే వాడని.. కొంతకాలం పాటు ప్రయాణించగా.. ఒక రోడ్డు మార్గం ద్వారా రియాద్ అనే ప్రాంతానికి చేరుతారు.. అక్కడ పోలీసులకు లొంగిపోతే తన దగ్గర పత్రాలు లేనందువలన 10 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపి ఆ తర్వాత ఇండియాకి పంపించేశారట. ఇక ఇలా వాస్తవికతకు అద్దం పడుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది గొర్రె బతుకు అని పదాన్ని మలయాళం లో ఆడు జీవితం పేరిట రిలీజ్ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ( Prithviraj Sukumaran ) పృథ్విరాజ్ సుకుమారాన్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు