Tillu Suqare Day 1 Collections : “టిల్లు స్క్వేర్” డే 1 కలెక్షన్స్… దుమ్మురేపిన టిల్లు

Tillu Suqare Day 1 Collections : భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన క్రేజీ మూవీ టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోల ద్వారా భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన టిల్లు స్క్వేర్ మొదటి రోజు కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద అరాచకం సృష్టించింది. మరి ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే…

టిల్లు స్క్వేర్ ఫస్ట్ డే కలెక్షన్ల సునామి…

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ టైం కలిసి నటించిన మూవీ టిల్లు స్క్వేర్. 2022లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కింది. మల్లిక్ రాం దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ, క్రైమ్, రొమాంటిక్ అంశాలను కలగలిపి తెరకెక్కించిన ఈ మూవీ ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. టిల్లు స్క్వేర్ మూవీ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టినట్టు చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ మూవీ 11.5 కోట్లు, తమిళనాడులో 2 లక్షలు, కర్ణాటకలో 1 కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ. 15 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఫస్ట్ డే 10 కోట్లు, నార్త్ అమెరికాలో సుమారు 1 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది. మొత్తానికి మొదటి రోజే అంచనాలను అందుకుని కలెక్షన్ల సునామీ సృష్టించింది ఈ మూవీ. మరి ఫుల్ రన్ లో నిర్మాతల ఎక్స్పెక్టేషన్స్ ను అందుకొని 100 కోట్ల క్లబ్ లో టిల్లు స్క్వేర్ చేరుతుందా అనేది చూడాలి.

నైజాం కింగ్స్ లో మూడవ ప్లేస్ లో టిల్లు…

ఇప్పటిదాకా చిన్న హీరోగా ఉన్న సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీతో టాలీవుడ్ లో ఉన్న మీడియం రేంజ్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఫస్ట్ డే ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ రికార్డు స్థాయిలో ఉండడం విశేషం. నైజాం ఏరియాలో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో మూవీగా టిల్లు స్క్వేర్ కొత్త చరిత్రను క్రియేట్ చేసింది. ఈ లిస్ట్ లో నాని హీరోగా నటించిన దసరా మూవీ 6.78 కోట్ల కలెక్షన్స్ తో మొదటి స్థానంలో, విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఖుషి మూవీ 5.15 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. టిల్లు స్క్వేర్ 4.35 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. లైగర్ మూవీ 4.26 కోట్లతో నాలుగవ స్థానంలో, హనుమాన్ 3.66 కోట్లతో ఐదవ స్థానంలో నిలిచాయి.

- Advertisement -

ఆ తరువాత 3.36 కోట్లతో ఇస్మార్ట్ శంకర్, 3.23 కోట్లతో స్కంద, 3.10 కోట్లతో ఎంసీఏ, 3.06 కోట్లతో లవ్ స్టోరీ, 3.04 కోట్లతో ఉప్పెన, 2.75 కోట్లతో డియర్ కామ్రేడ్ తర్వాత స్థానంలో వరుసగా ఉన్నాయి. మొత్తానికి డీజే టిల్లు మూవీతో మంచి పాపులారిటీని దక్కించుకున్న సిద్దు జొన్నలగడ్డ, దాని సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో నైజాం కింగ్ గా ఎదగడం విశేషం. రానున్న రోజుల్లో విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలకు సిద్దు గట్టి పోటీ ఇస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు