Pushpa 2 Update : టీజర్ వచ్చేది అప్పుడే…

Pushpa 2 Update : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప-2 సినిమా ఏడాది ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. అయితే ఈ సినిమా కీలక అప్డేట్స్ కోసం అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. ముఖ్యంగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదలవుతుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

పుష్ప -2 పై భారీ హైప్…

అయితే త్వరలోనే మేకర్స్ ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. పుష్ప మొదటి భాగంలో అల్లు అర్జున్ , రష్మిక తో పాటు ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, అజయ్ తదితరులు సైతం నటించారు.. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.. దాదాపుగా ఇప్పటికీ కూడా ఈ చిత్రంలోని పాటలు అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం.. ఇక విడుదల తేదీ సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా పైన మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది.

బన్నీకి ఈ ఏడాది ఎందుకంత ప్రత్యేకం..

అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికీ 21 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా..ఈ ఏడాది అల్లు అర్జున్ కి చాలా స్పెషల్ ఇయర్ గా మారిపోతుంది.. అంతేకాకుండా అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వసూలు సాధించిన పుష్ప మొదటి భాగం సంచలనాలను సృష్టించింది.. ఇప్పుడు పుష్ప-2 సినిమా కూడా విడుదల కాబోతూ ఉండడంతో.. 2024 అల్లు అర్జున్ కు మరింత స్పెషల్ గా ఉండబోతోంది.. ఇకపోతే అల్లు అర్జున్ మొదటి చిత్రం గంగోత్రి కూడా 21 ఏళ్ల క్రితం అంటే మార్చి 28న విడుదల అయింది..

- Advertisement -

అల్లు అర్జున్ చిత్రాలు..

సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలను పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ అభిమానులకు ఏడాది కచ్చితంగా సడన్ సర్ప్రైజ్లు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది..ఇకపోతే అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు జపాన్ లో విపరీతంగా పెరిగిపోయింది. బాలీవుడ్ లో కూడా అంతే క్రేజ్ తో అల్లు అర్జున్ సినిమాలు ఆడుతున్నాయి. అందుకే అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అభిమానులు అంతేగా వైరల్ చేస్తున్నారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది..

అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితం..

లేకపోతే అల్లు అర్జున్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత కొన్నేళ్ళకి ఒక కూతురు ఒక కొడుకు జన్మనిచ్చారు. కూతురు అర్హ ఇప్పటికే సినిమాలలో నటించింది. త్వరలోనే కొడుకు అయాన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు