Jack : సిద్ధూ జాక్ సినిమాకు బ్రేక్ పడనుందా?

Jack : సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా సినిమా టిల్లు స్క్వేర్ థియేటర్లలో అదరగొడుతుంది. డీజే టిల్లు కి సీక్వెల్ గా ఈ టిల్లు స్క్వేర్ తెరకెక్కిందన్న విషయం తెలిసిందే. అందువల్ల ఈ సినిమా పై ముందు నుండి భారీ అంచనాలు ఏర్పడగా, అనుకున్నట్టుగానే అంచనాలని అందుకుని భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక మార్చి 29న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే 70 కోట్ల వసూళ్ళని అందుకుని వంద కోట్ల దిశగా పరుగులు తీస్తుంది. ఇక టిల్లు స్క్వేర్ తో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ వాస్తవానికి ఈ వారం నుంచి తాను నటిస్తున్న తదుపరి సినిమా జాక్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ప్రముఖ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైమ్ అండ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మీద బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అప్పుడే మూవీ కాన్సెప్ట్ కూడా కామెడీ లవ్, యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుందని హిట్ ఇచ్చారు.

టిల్లు గాని కోసం జాక్ కు బ్రేక్?

అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ జోరు థియేటర్ల వద్ద భారీగా ఉండటంతో ప్రమోషన్లను స్టడీగా ఇంకో పది రోజులు కొనసాగిస్తే వంద కోట్ల గ్రాస్ ఈజీ గా దాటేందుకు అవకాశాలు పెరుగుతాయి కనుక, ఆ మేరకు సిద్దు డేట్లు టిల్లు స్క్వేర్ కే కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీని వల్ల జాక్ కు డేట్లు సర్దుబాటు చేయడం కష్టంగా మారిందని అంతర్గత సమాచారం. మరోవైపు ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న వైష్ణవి చైతన్య త్వరలో రిలీజ్ కాబోతున్న ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’ ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉంటుంది. దిల్ రాజు సినిమా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా ప్రమోషన్లు స్టార్ట్ అవుతాయి. అసలే దిల్ రాజు దీని మీద భారీ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. తన బ్యానర్ లో వస్తున్న సినిమా కాబట్టి ముందు విజయ్ దేవరకొండ సినిమా సందడి తగ్గాక, ఆశిష్ రెడ్డి లవ్ మీ మూవీ పబ్లిసిటీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని పక్కా ప్లాన్ తో ఉన్నారట. దానికి అనుగుణంగా ముందుగానే వైష్ణవి డేట్లను బ్లాక్ చేసుకోమని టీమ్ కు చెప్పినట్టు తెలిసింది. పైగా దిల్ రాజు అడిగితే కాదనలేని పరిస్థితి ఆ అమ్మాయిది. దీంతో సరేననడంతో జాక్ (Jack) షూటింగ్ కు రెండో ఇబ్బంది మొదలయ్యిందని వినికిడి.

- Advertisement -

అయితే మేకర్స్ ప్లాన్ చేసుకున్న ప్రకారం కాకుండా తప్పని సిచ్యువేషన్ లో జాక్ ని బ్రేక్ వేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇదంతా ఆఫ్ ది రికార్డు జరుగుతున్న మ్యాటరే కాబట్టి అధికారికంగా ఎవరూ ధృవీకరణ చేయలేరు. ఒకవేళ టిల్లు స్క్వేర్ కనక ఇంత పెద్ద ఫలితం అందుకోకపోయి ఉంటే సిద్దు త్వరగా జాక్ మూవీ సెట్లో అడుగు పెట్టేవాడేమో. అయితే లవ్ మీ సినిమాలో ఆశిష్ హీరో కావడంతో దిల్ రాజు ఎంతగా ఎలివేట్ చేస్తున్నారో చూస్తున్నాం. అందువల్ల హీరోయిన్ పాత్ర పోషిస్తున్న వైష్ణవి అది రిలీజయ్యే ఏప్రిల్ మూడో వారం దాకా టీమ్ తో ఉండక తప్పదు. ఏది ఏమైనా టిల్లు స్క్వేర్ తర్వాత జాక్ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి కాబట్టి, సినిమా కాస్త లేట్ అయినా పక్కా స్క్రిప్ట్ తో రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు