War 2 : హృతిక్, ఎన్టీఆర్ ల బాడీ డబుల్స్… కొత్త టెక్నాలజీని వాడిన మేకర్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మూవీ “వార్ 2”. ఈ మూవీలో నటిస్తున్న స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్ ల బాడీ డబుల్స్ కోసం మేకర్స్ కొత్త టెక్నాలజీని వాడుతున్నారట. ఫేస్ స్వాప్ తో ఈ మూవీ టెక్నికల్ గా మరింత రూపొందనుందని తెలుస్తోంది. మరి ఇంతకీ ఈ ఫేస్ స్వాప్ కథ ఏంటి? అంటే…

“వార్ 2″తో బాలీవుడ్ ఎంట్రీ…
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. 2019వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “వార్” అనే సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న “వార్ 2” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడు. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాగా వార్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే హృతిక్ ఇంట్రడక్షన్ సీన్ ని ఒక హై-ఆక్టేన్ సీక్వెన్స్ గా షూట్ చేశారు. ప్రస్తుతం “దేవర” సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ షూట్ అవగానే “వార్ 2” షూట్ లో జాయిన్ కానున్నారు.

60 రోజుల కాల్షీట్స్…
బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఈ సినిమా కోసం 60 రోజులు కేటాయించారు. అందులో 30 రోజులు వారి కాంబో సీన్స్ కోసం కేటాయించారు. అంతేకాదు ఆ కథనం ప్రకారం, జూన్ 2024 నాటికి హృతిక్ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేస్తాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం జూలై 2024 నాటికి పూర్తి చేస్తాడనీ అంటున్నారు. ఈ సినిమాను తెరకెక్కించే విషయంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ చాలా కాలం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పై దృష్టి పెట్టారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా వార్ 2 చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వార్ 2 కోసం టీమ్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని దాని ప్రకారం ఎక్కువ భాగం షూటింగ్ స్టూడియోలలోనే జరుగుతుందని చెబుతున్నారు.

- Advertisement -

బాడీ డబుల్స్ కోసం ఫేస్ స్వాప్…
అసలు విషయం ఏమిటంటే… ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కి సంబంధించిన బాడీ డబుల్స్ ని వాడుతున్నారు. సాధారణంగా హీరోల బదులు వారి బాడీ డబుల్స్ కొన్ని సీన్లలో కనిపించడం జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ వారి ఫేస్ లు కనపడకుండా ఉన్న సీన్స్ మాత్రమే షూట్ చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో అలాంటి పరిమితులు ఏమీ పెట్టుకోకుండా షూటింగ్ జరిపేస్తున్నారని తెలుస్తోంది. అలా చేయడానికి గల ముఖ్య కారణం ఒక సరికొత్త టెక్నాలజీతో ఫేస్ స్వైపింగ్ చేయవచ్చని మేకర్స్ భావించడమే అని సమాచారం. దీన్ని ఒక్కమాటలో చెప్పాలంటే…

వేరే వ్యక్తులు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాగా నటిస్తారు. కానీ తర్వాత ఎడిటింగ్ లో వారి ఫేసు స్వైపింగ్ చేస్తారు. ఈ మేరకు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరి కాంబినేషన్లో ఉన్న కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారని తెలుస్తోంది. ఆ షూట్ కి కేవలం హృతిక్ రోషన్ ఒక్కడే హాజరయ్యాడు. కానీ అక్కడే జూనియర్ ఎన్టీఆర్ బాడీ డబుల్ ని వాడి కొన్ని సీక్వెన్స్ షూట్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ టెక్నాలజీ కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ఎన్నో ఆసక్తికరమైన కాంబినేషన్లకు పనికొస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు