Hrithik Roshan : హృతిక్ నెట్ వర్త్ 3101 కోట్లు… సినిమాల నుంచి కాదు, పార్ట్ టైం జాబ్ తోనే ఇన్ని వేల కోట్ల సంపాదన!!

Hrithik Roshan

గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ రిపబ్లిక్ డే సందర్భంగా “ఫైటర్” మూవీతో థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఏవియేషన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే హృతిక్ రోషన్ సంపాదన గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయట పడింది. ఈయన సినిమాల ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో ఏకంగా వేల కోట్ల ఆస్తులు ఆస్తులు కూడబెట్టుకుంటున్నాడట. దానికోసం ఏకంగా ఆరు పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నాడట ఈ స్టార్ హీరో.

సాధారణంగానే స్టార్ హీరోల ఆస్తులు కోట్లలో ఉంటాయన్న విషయం అందరికీ తెలుసు. సినిమాల ద్వారానే వందల కోట్ల రెమ్యూనరేషన్లు అందుకుంటున్న నేటితరం హీరోల ఆస్తులు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అయితే హృతిక్ రోషన్ నెట్ వర్త్ ప్రస్తుతం 3101 కోట్లు. ఇన్ని వేల కోట్లను హృతిక్ రోషన్ కేవలం పార్ట్ టైం జాబ్ చేసే సంపాదించాడట. అయినా స్టార్ హీరో కదా పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంతకీ ఆ జాబ్స్ ఏంటి అంటే… ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బ్రాండ్ ప్రమోషన్లు, యాడ్స్, బిజినెస్ వంటి వాటి ద్వారా హృతిక్ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. సినిమాల్లో ఈ హీరో సంపాదన వేరే లెక్కల్లో ఉంది. మూవీస్ ద్వారా కాకుండా ఆయన తనకున్న క్రేజ్ ను ఉపయోగించుకొని 6 మార్గాల్లో వందల కోట్లను తన జేబులో వేసుకుంటున్నారు.

2013లో హృతిక్ HRX అనే బ్రాండ్ లైఫ్ స్టైల్ క్లాతింగ్ స్టోర్ ఓపెన్ చేసి ఫిట్నెస్ పట్ల తనకున్న అభిరుచిని చాటుకున్నాడు. HRX స్టోర్ లో ప్రీమియం క్వాలిటీ వర్కౌట్ యాక్ససరీస్ అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ బ్రాండ్ లో మింత్రా మెజార్టీ వాటాను చేసినట్టు తెలుస్తోంది. హృతిక్ ఈ కంపెనీ విలువ 200 కోట్లు ఉంటుంది. 2017 లో హృతిక్ రోషన్ హెల్త్ అండ్ వెల్నెస్ స్టార్ట్ అప్ క్యూర్.ఫిట్ తో 100 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే ఈ కంపెనీలో ఈక్విటీ వాటాను కూడా సొంతం చేసుకున్నాడు. 2018లో హృతిక్ బెంగళూరులో మరో ఫిట్నెస్ ఆధారిత స్టార్టప్ కంపెనీలో 6 కోట్లు పెట్టుబడి పెట్టాడు.

- Advertisement -

మరోవైపు రాడో, మౌంటెన్ డ్యూ, ఒప్పో, జీబ్రానిక్స్, టాటా టిగోర్, ఫెర్రెరే రోచర్ ఖరీదైన బ్రాండ్లను హృతిక్ ప్రమోట్ చేస్తున్నాడు. ఒక్కో బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి ఈ హీరో మూడు నుంచి ఐదు కోట్ల వరకు వసూలు చేస్తాడు. ఇక 47 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియాలో అత్యంత పాపులారిటీ పొందిన భారతీయ సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచారు హృతిక్. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక్కో ప్రమోషనల్ పోస్ట్ కోసం హృతిక్ 4-5 కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటాడు. వీటితోపాటు ఫిలిం క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రొడక్షన్ హౌస్ ను కూడా ఈ హీరో రన్ చేస్తున్నాడు.

1980లో తన తండ్రి ప్రారంభించిన ఈ ప్రొడక్షన్ హౌస్ లో క్రిష్, కహో నా ప్యార్ హై వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రూపొందాయి. 2022లో ఈ ప్రొడక్షన్ హౌస్ కోసం ముంబైలో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 33 కోట్లు పెట్టి ఆఫీసు స్థలాన్ని కొనుగోలు చేశాడు హృతిక్ రోషన్. మరోవైపు జస్ట్ డాన్స్ అనే రియాల్టీతో షోతో 2011లో టెలివిజన్ లోకి అడుగు పెట్టాడు. అప్పట్లో ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు 2 కోట్లు అందుకున్నాడు. ఇక మరోవైపు ఒక్కో సినిమాకు హృతిక్ 50 కోట్లు పారితోషకంగా తీసుకుంటున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు