Vijay Devarakonda : రౌడీ హీరో సాలిడ్ రికార్డ్.. టైర్ 2 హీరోల్లో టాప్!

Vijay Devarakonda : టాలీవుడ్ లో మీడియం హీరోల రేంజ్ ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది. ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోల్లో నాని టాప్ లో ఉండగా, ఆ తర్వాత విజయ్ దేవరకొండ టాప్ లోకి వచ్చాడు. మోనా మధ్య నాగ చైతన్య ఆక్రమించగా, ప్రస్తుతం నాని సూపర్ ఫామ్ తో మీడియం రేంజ్ హీరోల్లో నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. అయితే క్రేజ్ పరంగా గత పదేళ్లలో విజయ్ దేవరకొండ కి వచ్చిన క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. అలాగే సక్సెస్ తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ సినిమాలకి జరిగే బిజినెస్ కూడా సాలిడ్ గా ఉంటుందని చెప్పాలి. నిజానికి గత నాలుగేళ్లుగా విజయ్ దేవరకొండ  కి సరైన సక్సెస్ లేదని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఖుషి యావరేజ్ కాగా, అందులోనూ సగం క్రెడిట్ సమంత తీసుకుపోయింది. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ మీడియం రేంజ్ హీరోలలో హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంబంధం లేకుండా ప్రతీ సినిమాకి బిజినెస్ పరంగా దుమ్ము లేపుతూ దూసుకుపోతూనే ఉన్నాడు. అయితే సక్సెస్ మాట అటుంచితే మీడియం రేంజ్ హీరోలలో ఏ హీరో కూడా బిజినెస్ ల పరంగా ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ దరిదాపుల్లో లేడనే చెప్పాలి.

టైర్ 2 హీరోల్లో టాప్!

అయితే విజయ్ దేవరకొండ తన సినిమాలతో ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ సినిమాతో రచ్చ చేస్తున్నా కూడా, క్లీన్ హిట్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా సొంతం అవ్వడం లేదు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 43 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. అయితే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) లాస్ట్ 5 సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఇప్పుడు ఏకంగా 249 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం. ప్రస్తుతం టైర్ 2 హీరోల్లో 200 కోట్లకు పైగా బిజినెస్ ను 5 సినిమాలతో అందుకున్న ఒకే ఒక్క హీరోగా విజయ్ రికార్డ్ కొట్టాడు. మీడియం రేంజ్ హీరోల్లో నెంబర్ వన్ గా నిలిచిన నాని కూడా విజయ్ వెనకే ఉన్నాడు. ఒకసారి విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీస్ బిజినెస్ లెక్కలను గమనిస్తే.. ఫ్యామిలీ స్టార్ 43 కోట్లు, ఖుషి 52.50 కోట్లు, లైగర్ 88.40 కోట్లు, వరల్డ్ ఫేమస్ లవర్ 30.50 కోట్లు, డియర్ కామ్రెడ్ 34.60 కోట్లు జరిగింది.

సక్సెస్ తో ప్లేస్ మారే ఛాన్స్..

అయితే ఈ లాస్ట్ 5 సినిమాల టోటల్ బిజినెస్ లెక్క ఇప్పుడు ఆల్ మోస్ట్ 249 కోట్ల రేంజ్ లో ఉండగా యావరేజ్ గా ఒక సినిమా కి బిజినెస్ ఇప్పుడు 49.80 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి. కానీ ఈ లిస్టులో ఒక్క సినిమా కూడా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని దాటలేక పోయింది. అయితే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీ తో అయినా సాలిడ్ కంబ్యాక్ ను విజయ్ సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి. ఇక మీడియం రేంజ్ హీరోల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా నాని రెండో స్థానంలో నాగ చైతన్య మూడో స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాతో గనుక విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొడితే టైర్ 2 హీరోల నంబర్లు కూడా ఛేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు