Raviteja : వరుస ప్లాపులతో పాత రూట్లోకి రవన్న.. ఆ యంగ్ రచయితకి ఛాన్స్?

Raviteja : టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత స్వయంకృషితో ఎదిగిన స్టార్ మాస్ మహారాజ్ రవితేజ అని అందరూ అంటుంటారు. చిన్న చిన్న హీరో ఫ్రెండ్ పాత్రల నుండి హీరోగా ఎదిగిన వైనం చూస్తుంటేనే తెలిసిపోతుంది రవితేజ ఎంత కష్టపడ్డాడో.. అలా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టెడుగుతూ ఊర మాస్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో మాస్ సినిమాలకి కేరాఫ్ గా మారాడు. మాస్, కామెడీ, యాక్షన్ తరహా సినిమాలలో దిట్ట అయిన రవితేజ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడు. నిజానికి రవితేజ ఎంటర్టైన్మెంట్ రోల్స్ మాత్రం ఇరగదీస్తాడని చెప్పాలి. ఒకానొక సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి రవితేజ తో విక్రమార్కుడు ని పక్కా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీయాలనుకుని, రవితేజ రూట్లోకి పూర్తిగా వెళ్లాల్సి వచ్చిందంటే ఆయనకు ఎంటెర్టైన్మెంట్ లో ఉన్న గ్రిప్ ఎలాంటిదో అర్ధం చేసుకోవాలి. అయితే గత కొన్నాళ్లుగా మాత్రం రవితేజ తన లోని మాస్ యాంగిల్ ని, ముఖ్యంగా కామెడీ యాంగిల్ ని మిస్ అయ్యాడని తన సినిమాలను చూస్తే తెలిసిపోతుంది.

వరుస ప్లాపులతో పంథా మార్చుకున్నాడా?

అయితే రవితేజ గత కొన్నాళ్లుగా చేస్తున్న సినిమాలు మొత్తం సీరియస్ డ్రామాలే. ఆ మధ్య ధమాకా అంటూ తన మార్క్ కామెడీతో హిట్టు కొట్టిన రవన్న దానికి ముందు తర్వాత అరడజనుకి పైగా ప్లాపులు అందుకోగా, అవన్నీ సీరియస్ యాక్షన్ డ్రామాలే కావడం గమనార్హం. ఎక్స్పెరిమెంట్ పేరిట డిఫరెంట్ గా మూవీస్ చేసిన ప్రతిసారి బోల్తాపడ్డాడు. లాస్ట్ ఇయర్ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, అలాగే లేటెస్ట్ గా ఈగల్ మూడు సినిమాల్లో రవితేజ చాలా సీరియస్ గా ఉంటాడు. అలాగే మూడు డిఫెరెంట్ కథాంశంతో వచ్చాయి. కానీ రవితేజ క్యారెక్టరైజేషన్ మాత్రం ఒకేలా ఉంటుంది. ఇవన్నీ దారుణంగా బెడిసికొట్టాయి. అందుకే రవితేజ తాను ఏం కోల్పోయాడో తెలుసుకున్నాడు. తిరిగి తన పంథా మార్చుకుని పాత పంథా లోకి రావాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

ఆ యంగ్ రచయిత కి దర్శకుడిగా ఛాన్స్?

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) తాను ఎదురుకున్న ప్లాపుల నుండి తేరుకుని మూస ధోరణిలో కాకుండా ఎలాగైనా హిట్టు కొట్టాలని కసితో ఉన్నాడు. అందుకే తన పాత స్టైల్ లో ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేయాలనీ చూస్తున్నట్టు తెలుస్తుంది. యాక్షన్ సినిమాలతో వరుస ఫ్లాప్స్ విసుగెత్తిపోయిన రవన్న కామెడీ కథల కోసం ఎదురుసూస్తున్నాడట. ఈ క్రమంలో రవితేజ కు సామజవరగమన కథా రచయిత ‘భాను బోగవరపు’ చెప్పిన కథ బాగా నచ్చిందని సమాచార. ఇక అతడిని దర్శకుడిగా పరిచయం చేయాలని మాస్ మహారాజా డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. పైగా కొత్త దర్శకుల్ని పరిచయం చేసి సక్సెస్ కొట్టడంలో ఉద్ధండుడు మన మాస్ రాజా. కాబట్టి ఈ సినిమాతో పక్కా కమెర్షియల్ కామెడీ హిట్టు కొట్టి సైల్డ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే దీనిపై కన్ఫర్మేషన్ రావాలి. ప్రస్తుతం హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ చేస్తుండగా ఈ ప్రాజెక్ట్ ని త్వరలోనే మొదలు పెట్టనున్నాడని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు