Eagle: మరీ ఇంత ఫేక్ చూపించడం అవసరమా?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన “ఈగల్” సినిమా పది రోజుల కింద ఫిబ్రవరి9న రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరి నిర్మించింది. సంక్రాంతికి రావాల్సిన ఈగల్ గ్యాప్ రావడం వల్ల పెద్దగా హైప్ లేకుండా రిలీజ్ కాగా, ఆఫ్ లైన్ లో మంచి కలెక్షన్లను వీకెండ్ లో వసూలు చేయడం వల్ల ఈగల్ తెలుగు రాష్ట్రాల్లో ఆడేస్తుందని అనుకున్నారు. కానీ వర్కింగ్ డే లోకి ఎంటర్ అయ్యాక డల్ అయిపొయి కనీసం రోజుకి కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది.

ఇక రెండో వీకెండ్ లో అయినా ప్రభావం చూపిస్తుందనుకుంటే ఇక్కడ కూడా ఏమి దమ్ము చూపించలేదు. పైగా ఈ వారం రిలీజ్ అయిన ఊరు పేరు భైరవకోన సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకే ప్రేక్షకులు వెళ్తున్నారు. అయితే ఈగల్ మేకర్స్ మాత్రం తమ సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తుందంటూ, ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయిందంటూ కలెక్షన్లతో పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో ఈగల్ 10 రోజుల్లోనే 51 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని వేశారు.

నిజానికి ఈగల్ సినిమా ఇప్పటివరకు కేవలం 15.85 కోట్ల షేర్, 29 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. కానీ పోస్టర్ లో 20 కోట్ల వసూళ్లు ఎక్కువ యాడ్ చేయడం రవితేజ ఫ్యాన్స్ కి కూడా నచ్చడం లేదు. ప్లాప్ లను లెక్క చేయని రవితేజ ఇలా ఫేక్ కల్లెక్షన్లను ఎప్పుడూ ఎంకరేజ్ చేయడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇతర హీరోల ఫ్యాన్స్ మాత్రం ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు.

- Advertisement -
Eagle Fake Collections

అయితే 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈగల్ బ్రేక్ ఈవెన్ కావాలంటే 21 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉండగా, ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 6 కోట్లయినా రాబట్టాలి. కానీ మేకర్స్ మాత్రం ఇలాంటి ఫేక్ కలెక్షన్ల పోస్టర్స్ తో ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్నారు. తమ లెక్కలు కవర్ చేసుకోవడానికి ఇలాంటి ఫేక్ లెక్కలు చూపించడం అవసరమా అని ట్రేడ్ విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు