Rakul – Jacky: పెళ్లిలో ఫుడ్ మెనూ రివీల్.. నోరూరాల్సిందే..!

ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీభగ్నానీ తో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఏడడుగులు వేయబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 21వ తేదీన గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోనున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహం కోసం గోవాకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా ఈ పెళ్లికి సంబంధించిన ఒక అప్డేట్ బయటకి వచ్చింది. తాజాగా రకుల్, జాకీల వివాహానికి సంబంధించి ఫుడ్ మెనూ వార్తల్లో వైరల్ గా మారింది.

భారతీయ మరియు అంతర్జాతీయ ఫుడ్ మెనూని ఈ జంట రూపొందించడానికి ఒక ప్రత్యేక చెఫ్ ను కూడా నియమించుకున్నారట. పెళ్లిలో ఫిట్నెస్ కాన్షియస్ ఉన్న అతిధుల కోసం సుషీ వంటి వంటకాలను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అంతేకాదు పెళ్లికి వచ్చే అతిధుల ఆరోగ్యంపై కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మెనూలో ఎక్కువగా గ్లూటెన్ రహితంగా, చక్కెర రహితంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఫిట్నెస్ ఫ్రీక్ గెస్ట్ ల కోసం ప్రత్యేక మెనూ కూడా సిద్ధం చేయబడింది. ఎలాగో రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా ఫిట్నెస్ ఫ్రీక్ అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఫాలో అవుతుంది. కాబట్టి తమ వివాహానికి వచ్చే అతిధుల కోసం కూడా ప్రత్యేకించి ఆమె దగ్గరుండి మరి మెనూని తయారు చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ ల వివాహం పర్యావరణ అనుకూలమైనది. ఈ జంట అతిధులందరికీ ఇ – ఇన్విటేషన్ కార్డులను మాత్రమే పంపారు. అంతేకాకుండా పెళ్లిలో ఎలాంటి క్రాకర్స్ కూడా పేల్చరు.. పైగా ఈ జంట తమ పెళ్ళిలో కూడా మొక్కలు నాటబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్, నటుడు – నిర్మాత జాకీ భగ్నానీల వివాహం 2024లో జరగబోతున్న తొలి బాలీవుడ్ వివాహం గా నిలిచారు. అంతేకాదు ఈ సంవత్సరం ఏ ఇతర జంటలు వీరి అడగజాడలను అనుసరించి పెళ్లి బంధంతో ముడిపడతారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

రకుల్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైన ఈమె ఒక వైపు సినిమాలు మరొకవైపు యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తోంది. అంతేకాదు హైదరాబాదులో రెండు ప్రత్యేక జిమ్ సెంటర్లను కూడా నడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే సినిమాలతోనే కాదు ఇలాంటి పనుల ద్వారా కూడా భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు తమ పెళ్లి విషయంలో అన్ని ప్రత్యేకతలు చాటుకుంటూ మరొకసారి వార్తల్లో నిలిచారని చెప్పవచ్చు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు