Rakul Preet Singh : రాజభవనం లాంటి రిసార్ట్ లో రకుల్ పెళ్లి… ఒక్క రోజు రెంట్ ఎంతంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడితో పెళ్లికి సిద్ధమైంది. ఫిబ్రవరి 21న నిర్మాత జాకీ భగ్నానితో రకుల్ పెళ్లి ఘనంగా జరగబోతోంది. ముందుగా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్న ఈ జంట తాజాగా పెళ్లి వేదికను మార్చేశారు. గోవాలోని ఓ లగ్జరీ రిసార్ట్ లో పెళ్లి చేసుకోబోతున్నారు ఈ లవ్ బర్డ్స్. మరి రకుల్, జాకీ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టనున్న ఆ రిసార్ట్ ఎక్కడుంది? దానికి ఈ సెలబ్రిటీ కపుల్ ఎంత రెంటు కడుతున్నారు? అనే ఆసక్తికరమైన విషయాల్లోకి వెళ్తే…

రకుల్, జాకీ భగ్నాని చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ పలు పార్టీలు, సినిమా ఈవెంట్లలో కలిసి కనిపించడంతో లవ్ లో ఉన్నారు అనే రూమర్లు మొదలయ్యాయి. అయితే వీళ్ళు వాస్తవానికి లాక్ డౌన్ సమయం నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవైపు తెలుగు, తమిళ, కన్నడతో పాటు బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ఆకట్టుకుంటుండగా, మరోవైపు ఆమెకు కాబోయే భర్త జాకీ భగ్నానీ హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. సినిమా రంగానికి చెందిన వీరిద్దరూ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతుండడం విశేషం. సౌత్ గోవాలోని ఐటిసి గ్రాండ్ హోటల్ లో రకుల్, జాకీల వివాహం వైభవంగా జరగబోతోంది. వీరి వివాహానికి కేవలం అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ హోటల్ ను రకుల్, జాకీ తమ పెళ్లి వేదికగా బుక్ చేశారని సమాచారం. 45 ఎకరాల్లో ఉన్న విలాసవంతమైన హోటల్ ఇది. ఇందులో మొత్తంగా 246 గదులు ఉన్నాయి. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉండే అందమైన రాజభవనం లాంటి ఈ రిసార్ట్ పెళ్లికి పర్ఫెక్ట్ గా ఉంటుందని రకుల్ భావించిందట.

ఇక ఈ గ్రాండ్ హోటల్ లో ఉన్న ఒక్కొక్క గది ధర ఒక్క రాత్రికే 19,000 నుండి 75,000 వరకు ఉండడం గమనార్హం. అంతేకాకుండా దానికి కొన్ని అదనపు పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి మూడు రోజులపాటు జరగనున్న పెళ్లి వేడుక కోసం ఈ హోటల్ రెంట్ గా భారీ మొత్తంలో రకుల్, జాకీ చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. కాగా రకుల్, జాకి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. అందుకే అతిథులు ఎవ్వరికీ ప్రింటెడ్ ఇన్విటేషన్లు పంపలేదు. ఇన్విటేషన్ల వ్యవహారం అంతా డిజిటల్ గానే జరిగినట్టు తెలుస్తోంది. అలాగే ఈ వివాహ వేడుకలో పటాకులు పేల్చడానికి కూడా అనుమతి లేదని ఈవెంట్ మేనేజర్ ఇప్పటికే స్పష్టం చేశారు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు