Karthikadeepam 2: సీజన్2 దిశగా అడుగులు.. ఆడియన్స్ రియాక్షన్ చూస్తే షాక్..!

ఏ భాషలోనైనా సరే సీరియల్స్ కు ఆడియన్స్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సీరియల్స్ కు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. అలా ప్రేక్షక ఆదరణ సంపాదించిన సీరియల్స్ లో కార్తీక దీపం సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారమయ్యేది.. ఈ సీరియల్ రికార్డు స్థాయిలో రేటింగ్స్ కూడా లభించాయి. ఈ సీరియల్ ను విచిత్రమైన మలుపులు తిప్పి ముగించడంతో చాలా మంది ప్రేక్షకులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఈ సీరియల్ ఇప్పుడు సీక్వెల్ దిశగా అడుగులు వేయబోతోందనే వార్తలు గత కొన్ని నెలలుగా వినిపిస్తున్నాయి.

“కార్తీకదీపం మళ్లీ వస్తోందంటూ” స్టార్ మా ఒక కీలకమైన ప్రకటన చేసింది.. ఒకవేళ వస్తే కార్తీకదీపం సీక్వెల్లో నిరూపమ్ ,ప్రేమీవిశ్వనాథ్ కనిపిస్తారా? లేక ఇతర నటీనటులు కనిపిస్తారా? అనే విషయం పైన అభిమానులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కార్తీకదీపం సీరియల్ వస్తే మాత్రం అంచనాలకు మించి హిట్ అయ్యే అవకాశం ఉంటుందంటూ అభిమానులు తెలుపుతున్నారు. కార్తీకదీపం సీరియల్ సీక్వెల్ కూడా బడ్జెట్ సైతం భారీగానే పెరిగే అవకాశం ఉన్నది.

ఇప్పటివరకు అధికారికంగా కార్తీకదీపం సీజన్-2 ఎప్పుడు అనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఈ సీజన్ అంచనాలకు మించి సక్సెస్ అవుతుందని అభిమానులైతే భావిస్తున్నారు. స్టార్ మా చానల్లో బెస్ట్ సీరియల్స్ లో ఈ సీరియల్ ఒకటిగా నిలిచిపోయింది. ఇతర చానల్స్ సైతం స్టార్ మాతో పోటీ పడ్డప్పటికీ టిఆర్పి రేటింగ్ లో మాత్రం మొదటి స్థానంలోనే నిలిచేది. అంతేకాదు కార్తీకదీపం సీరియల్ కు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉన్నది.

- Advertisement -

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రేక్షకుల అభిరుచి కూడా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం బుల్లితెరపై కంటే ఓటీటీ లోనే టీవీ సీరియల్స్ ను చూడడానికి చాలా మక్కువ చూపుతున్నారు. మరి కార్తీకదీపం డైలీ సీరియల్ రావాలి అని.. ఎన్నో సీరియల్స్ చూసినప్పటికీ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న చాలా సీరియల్స్ యొక్క రేటింగ్ తగ్గడంతో స్టార్ మా కార్తీకదీపం-2 తీసుకువచ్చే ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయం పై అధికారికంగా స్టార్ మా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఒకవేళ వస్తే మాత్రం ఈ సీక్వెల్ కూడా భారీ విజయాన్ని అందుకుంటుందనటంలో సందేహం లేదు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు