Raviteja: సొల్లు చెప్పకు.. ఎవరికోసం కష్టపడతావ్.. టార్గెట్ వారేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చి హీరోగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రవితేజ. ఎంతో మంది స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగారు. అయితే ఈ స్థాయికి రావడానికి రవితేజ పడిన కష్టాలు గురించి చెప్పాల్సిన పనిలేదు.. చిన్నతనం నుంచే సినిమాలలోకి రావాలనే బలమైన కోరిక రవితేజకు ఉండేదట. తన తండ్రి ఉద్యోగ రీత్యా ఎక్కువగా నార్త్ లో పని చేయడంతో.. ఆంధ్రప్రదేశ్లో చదువుకొని ఇక్కడే డిగ్రీ కూడా పూర్తి చేశారు.

ఇక్కడ చదువుకుంటున్న సమయంలో సినిమాలలో నటించాలనే కోరిక మరింత ఎక్కువ అవ్వడంతో.. ఇండస్ట్రీ లోకి వచ్చి ఎవరి సహాయం లేకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని.. సింధూరం సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే సింధూరం సినిమా కంటే ముందు ఎన్నో చిత్రాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించినా గుర్తింపు రాలేదు. అలా ఒక్కొక్క అవకాశాన్ని అందుకుంటూ టాలీవుడ్ లో మాస్ మహారాజాగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇంతటి కష్టాన్ని తెలిసిన వ్యక్తి కాబట్టే రవితేజ ఎప్పుడు తన కష్టం గురించి ఎక్కడ చెప్పుకోవడానికి ఇష్టపడరు.

ముఖ్యంగా ఎవరైనా కష్టపడుతున్నామని చెబితే అసలు ఒప్పుకోరు.. ఎవరికోసం కష్టపడుతున్నావ్.. వారు కష్టపడి దేశానికి ఏమైనా స్వతంత్రం తీసుకు వస్తున్నారా.. హీరో అవ్వడానికే ఇండస్ట్రీలోకి వచ్చి కష్టాలు పడితే అది ఎవరికి గొప్ప అంటూ చెబుతూ ఉంటారు.. ఎవరి స్వార్థం వారిదే.. గొప్ప హీరో అవ్వాలి లేకపోతే గొప్ప నటుడు అవ్వాలనే ఆశతోనే కష్టపడి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు. కష్టపడ్డ వారెవరు దేశం కోసం ఉద్ధరించిన వారు కాదు కదా.. తమ సొంత లాభం కోసమే కష్టపడుతున్నారంటూ తెలిపారు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకపోయినా కష్టపడాల్సిందే. ఆ కష్టాన్ని ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదని తెలిపారు.

- Advertisement -

కష్టాన్ని అవకాశంగా చూపించి అవకాశాలు అడగకూడదని.. అవకాశం వచ్చి నిలబడ్డ తర్వాతే తాను కష్టాలను చెప్పుకుంటే బాగుంటుందని రవితేజ తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా కష్టం విలువ తెలిసినవారు కాబట్టి చిన్ననాటి నుంచి జరిగిన ఏ కష్టాన్ని కూడా ఎవరితో షేర్ చేసుకోరు రవితేజ. ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఈగల్ సినిమాను విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు..

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు