Eagle : ఫస్ట్ వర్కింగ్ డే నే ఇలా అయిందేంటి?

Raviteja

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన “ఈగల్” సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల నిర్మించాడు. సంక్రాంతికి రావాల్సిన ఈగల్ గ్యాప్ రావడం వల్ల పెద్దగా హైప్ లేకుండా రిలీజ్ కాగా, రవితేజ గత సినిమాల కన్నా బెటర్ గా ఉండడంతో బిసి సెంటర్ల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకున్నారు. ఆన్లైన్ బుకింగ్స్ లో ఏమాత్రం జోరు చూపించకపోయినా, ఆఫ్ లైన్ లో మంచి కలెక్షన్లను వీకెండ్ లో వసూలు చేయడం వల్ల ఈగల్ తెలుగు రాష్ట్రాల్లో అయితే మౌత్ టాక్ వల్ల ఆడేస్తుందని అనుకున్నారు.

కానీ వర్కింగ్ డే లోకి ఎంటర్ అయ్యాకే అసలు లెక్క తెలిసింది. దీనితో పాటే రిలీజ్ అయిన సినిమాలన్నిటికీ నెగిటివ్ టాక్ రాగా, ఈగల్ కి అది ప్లస్ పాయింట్ గా మారి బాగా ఆడుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వీకెండ్ లో మంచి వసూళ్లే రాబట్టిన ఈగల్ వర్కింగ్ డే లో డల్ అయిపొయింది. నాలుగోరోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 96 లక్షల షేర్ వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 1.13 కోట్ల షేర్ సాధించింది. ఇక ఈగల్ నాలుగురోజుల్లో వరల్డ్ వైడ్ గా 12.88 కోట్ల షేర్ వసూలు చేయగా 23.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

- Advertisement -

అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 9 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలి. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా తక్కువే చేయగా, వీకెండ్ అడ్వాంటేజ్ తో కుమ్మిన ఈగల్ వర్కింగ్ డే లో ఇలా డల్ అవుతుందని అనుకోలేదు. ఈ వారం పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్న నేపథ్యంలో వారంలోపు ఈగల్ మినిమం కలెక్షన్స్ రాబట్టకపోతే బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని ట్రేడ్ వర్గాల సమాచారం. మరి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తర్వాత ఈ సినిమా అయినా రవన్న కి ఊరట కలిగిస్తుందో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు