Neha Shetty : అక్కడ స్పీడ్ లేదు గాని, ఫోటోషూట్స్ లో మాత్రం యమ స్పీడు..

టాలీవుడ్ లో టిల్లు గాని రాధికా గా ఫేమస్ అయిన నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పూరి జగన్నాథ్ తీసిన మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ “డీజే టిల్లు” తో వచ్చిన గుర్తింపు మామూలు కాదు. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ యూత్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది ఈ భామ. అయితే ఆ తర్వాత ఆఫర్లు ఓ రేంజ్ లో వస్తాయని అందరూ అనుకున్నా అలా జరగలేదు. అయితే డీజే టిల్లు చేసాక ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఖాళీగా ఉన్న నేహా శెట్టి 2023 లో మాత్రం ఫుల్ స్వింగ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది.

ఇక లాస్ట్ ఇయర్ చేసిన సినిమాల్లో రెండు సినిమాలు రిలీజ్ కాగా, వాటిలో బెదురు లంక హిట్ కాగా, రూల్స్ రంజన్ ప్లాప్ అయింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ నేహా గ్లామర్ కి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే చేసింది. ఇక ఇప్పుడు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే సినిమాతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాలో కూడా ఓరేంజ్ లో గ్లామర్ షో చేసింది నేహా.

ఇదిలా ఉండగా లేటెస్ట్ గా ఇంస్టా లో విడుదల చేసిన ఓ ఫోటోషూట్ ద్వారా యూత్ కి సెగలు పుట్టిస్తుంది ఈ టిల్లుగాని పోరి. గ్రీన్ కలర్ డ్రెస్ లో పోస్ట్ చేసిన ఆ ఫోటో షూట్ లో కనిపించి కనిపించకుండా ఎక్స్పోజ్ చేస్తూ మరోసారి టిల్లుగాని రాధికా ఏం మారలేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గానే ఓ ఫోటోషూట్ చేసిన నేహా, కొన్ని రోజుల గ్యాప్ లోనే దాన్ని మించిన పిక్స్ అప్లోడ్ చేసేసింది. ఇది గమనించిన కొందరు నెటిజన్లు సినిమాల్లో స్పీడ్ లేదు గాని ఫోటోషూట్లో యూత్ ని ఆగం చేయడానికి యమా స్పీడుగా ఉంటుంది రాధికా అలియాస్ నేహా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు