Neha shetty: ఒకటి హిట్టు.. మరొకటి ఫట్టు.. వాట్ నెక్స్టు..?

టాలీవుడ్ లో టిల్లు గాని రాధికా గా ఫేమస్ అయిన నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంతకు ముందే పూరి జగన్నాథ్ తీసిన మెహబూబా సినిమాతో ఇంట్రడ్యూస్ అయినప్పటికీ “డీజే టిల్లు” తో వచ్చిన గుర్తింపు మామూలు కాదు. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ యూత్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది ఈ భామ.

అయితే ఆ తర్వాత ఆఫర్లు ఓ రేంజ్ లో వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. డీజే టిల్లు చేసాక వన్ ఇయర్ ఖాళీగా ఉన్న నేహా శెట్టి ఈ ఇయర్ మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది.

ఇక అందులో ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కూడా అయ్యాయి. వాటిలో బెదురు లంక హిట్ కాగా, రూల్స్ రంజన్ ప్లాప్ అయింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ నేహా గ్లామర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసింది. ఇక ఇప్పుడు ఇదే ఏడాది “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే సినిమాతో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాలో కూడా గ్లామర్ షో బాగానే చేసింది నేహా.

- Advertisement -

మరి లాస్ట్ రెండు సినిమాలలో మరీ ఎక్కువగా ఫేమ్ అయితే రాలేదు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో టిల్లు భామ ఎంత క్రేజ్ సంపాదించుకుంటుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు