Riya Suman: మజ్ను భామకి ఎన్నాళ్ళు ఈ పేరులేని పాత్రలు?

టాలీవుడ్ లో మజ్ను సినిమాతో ఎంట్రీ ఇచ్చి పేపర్ బాయ్ తో ఫేమస్ అయిన భామ రియా సుమన్. చూడ్డానికి ఎంతో క్యూట్ గా ఉండే రియా డైరెక్ట్ గా తెలుగు సినిమాలతోనే ఎంట్రీ ఇచ్చింది. మొదటి రెండు సినిమాలతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా ఒక్కటీ హిట్ అవలేదు. పైగా వచ్చిన పాత్రలతో కనీసం ప్రత్యేక గుర్తింపు కూడా రాలేదు.

అసలే సినిమా ఇండస్ట్రీ లో హిట్లు లేకపోతే ఛాన్సులివ్వరు. అలాంటిది మంచి రోల్స్ అయినా ఇవ్వకపోతే ఎవరైనా గుర్తిస్తారా? ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ లోనే ఉంది రియా సుమన్. పేపర్ బాయ్ సినిమా మినహా రియా చేసిన సినిమాలన్నీటిలోను పేరులేని పాత్రలు, పెద్దగా ఇంపార్టెన్స్ లేని హీరోయిన్ రోల్స్, పాటలకే పరిమితమయ్యే పాత్రలు చేసింది.

ఈ ఇయర్ ‘మెన్ టూ’ అనే సినిమా తో ఆడియన్స్ ని పలకరించగా, తాజాగా “కిస్మత్” అనే కామెడీ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. అయితే ఈ సినిమాలో కూడా రియా సుమన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టరే ఇచ్చారట. తనకి మంచి పాత్ర ఇస్తే ఎంత కష్టమైనా నటిస్తానని, స్టోరీ డిమాండ్ చేస్తే డైరెక్టర్ ఏం చెప్పినా చేయడానికి సిద్ధమని రియా పలు ఇంటర్వ్యూ లలో కూడా చెప్పింది. మరి తనని తాను నిరూపించుకోవడానికి రియా ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాల్సి వస్తుందో.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు