Valentines day Re Release : లెక్కేస్తే ఏకంగా పది సినిమాలు..

 

టాలీవుడ్ లో ఈ ఇయర్ వాలెంటైన్స్ డే స్పెషల్ గా పలు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలన్నీ ప్రేమ కథా చిత్రాలే కాగా, వాలెంటైన్స్ డే దగ్గరవుతున్న కొద్దీ సినిమాల సంఖ్య పెరుగుతూ పోయింది. ముందుగా ఈ వారం వాలెంటైన్స్ డే స్పెషల్ గా ట్రూ లవర్ అనే డబ్బింగ్ సినిమా ఇప్పటికే రిలీజ్ కాగా ఆ సినిమాకు అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అయితే క్రమంలో కొన్ని క్లాసిక్ లవ్ స్టోరీస్ రీ రిలీజ్ కి రెడీ అయ్యాయి.

ముందుగా హైదరాబాద్ లో తెలుగు సినిమాలు మాత్రమే లైన్లో ఉండగా, వాలెంటైన్స్ డే దగ్గరయిన కొద్దీ ఒక్కో సినిమా రిలీజ్ డేట్లు అనౌన్స్ అయ్యాయి. అయితే ఈ సినిమాల లెక్క చూస్తే ఏకంగా పది సినిమాల లిస్ట్ దాటిపోయింది. టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ మాత్రమే కాకుండా, ఏకంగా హాలీవుడ్ సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో అన్నిటికంటే ముందుగా సిద్ధార్థ్ నటించిన ఓయ్, దుల్కర్ సల్మాన్ సీతారామం, సూర్య సం అఫ్ కృష్ణన్, అలాగే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ కూడా రీ రిలీజ్ అవుతుంది.

- Advertisement -

ఇక వాలెంటైన్స్ డే స్పెషల్ గా బాలీవుడ్ నుండి మైనే ప్యార్ కియా, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, మొహబ్బత్, వీర్ జారా, సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇక హాలీవుడ్ నుండి క్లాసిక్ టైటానిక్ మూవీ కూడా రీ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ గాకుండా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బేబీ మూవీ ని కూడా రీ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. మరికొన్ని లవ్ స్టోరీ మూవీస్ కూడా రీ రిలీజ్ కి రెడీ గా ఉన్నా, అవి ఇంకా అఫిషియల్ గా కంఫర్మ్ కాలేదు. ఈ సినిమాల లెక్క అఫిషియల్ గా 10 దాటగా అన్ అఫిషియల్ గా మరి ఐదారు సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయని టాక్.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు