NTR For Tillu Square : టిల్లు అన్న ఫంక్షన్ కు తారక్ అన్న

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఒక హీరోగా నిలబడి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకోవాలి అంటే అంత తేలికైన విషయం కాదు. చాలామంది హీరోలుగా వచ్చి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని, ఒక రెండు మూడు హిట్ సినిమాలు తర్వాత మళ్లీ వెనక్కి వెళ్ళిపోయి కనుమరుగైన సంగతి కూడా తెలిసిందే. కానీ మంచి సినిమాలను ఎన్నుకుంటూ కొంత కాలం పాటు హీరోగా నిలబడటం అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ లో చాలామంది కూడా కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా మల్టీ టాలెంట్ పీపుల్ ఉన్నారని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ లో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. జోష్ సినిమాతో కాలేజీ స్టూడెంట్ పాత్రలో కనిపించి ఆ తర్వాత ఆరెంజ్, భీమిలి కబడ్డీ జట్టు వంటి సినిమాలు చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనే సినిమాతో లీడ్ రోల్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా అంతగా బయటకు రాలేదు ఆ తర్వాత ప్రవీణ్ సత్తార్ చేసిన గుంటూరు టాకీస్ సినిమాతో కొంతమేరకు గుర్తింపును సాధించుకున్నాడు.

సిద్దు జొన్నలగడ్డ కృష్ణ అండ్ ఇస్ లీలా, మా వింత గాధ వినుమా వంటి సినిమాలకు కేవలం నటించడమే కాకుండా రైటర్ గా ఎడిటర్ గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమాలన్నీ కూడా ఒక క్లాస్ హిట్ అయి చాలా మంది యూత్ కి సిద్ధుని దగ్గర చేసాయి. కానీ సిద్దుకి బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం డీజే టిల్లు.

- Advertisement -

డీజే టిల్లు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సిద్దు జొన్నలగడ్డకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది ఈ సినిమా అని చెప్పొచ్చు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమా మొదలైన రోజు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సాధించి మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. అదే తరుణంలో ఈ సినిమాకి సీక్వెల్ కూడా చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు.

ఇకపోతే రీసెంట్ గా టిల్లు సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మొదటి షో నుంచి అద్భుతమైన స్పందన అందుకొని బీభత్సమైన కలెక్షన్స్ ను రాబడుతుంది. అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమా దాదాపు 70 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాల సమాచారం.ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ నిర్మాత నాగ వంశీ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత టిల్లు క్యూబ్ సినిమాను కూడా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా సాధించిన ఘనవిజయాన్ని బట్టి ఏప్రిల్ 8న ఈ సినిమాకు సంబంధించి ఒక సక్సెస్ ఈవెంట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సక్సెస్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇకపోతే రీసెంట్ గా విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ, నాగ వంశీ మీరు ముగ్గురు కలిసి తారక్ ను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు