OG Movie Update: ఓజి సినిమా గురించి డీవివి దానయ్య

పవన్ కళ్యాణ్ రీయంట్రీ తర్వాత వరుస సినిమాలను సైన్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయి ఉన్న అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సాధించాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు పవన్ కళ్యాణ్ అభిమానులకు సంతృప్తిని ఇచ్చాయి. కానీ పూర్తిస్థాయిలో సూపర్ హిట్ ఫిలిమ్ అంటూ ఇప్పటికి కూడా రాలేదు అని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు.

చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా అంటే ఓజి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి ఫ్యాన్ బాయ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుజిత్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చిన్న ఏజ్ లోనే షార్ట్ ఫిలిమ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని రన్ రాజా రాణి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సుజిత్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి సుజీత్ ను ఒక దర్శకుడుగా నిలబెట్టింది.

రన్ రాజా రన్ తర్వాత సుజిత్ చేసిన రెండవ సినిమా సాహో. ప్రభాస్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేదు. కానీ నార్త్ లో మాత్రం ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టి సుజిత్ కి మంచి ఫేమ్ ని తీసుకొచ్చింది. ఇకపోతే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉండేవి. అయితే ఆ అంచనాలన్నిటినీ కొంతమేరకు బాలీవుడ్ లో బాగానే అందుకున్నాడు సుజిత్. ఈ సినిమా టేకింగ్ పరంగా అద్భుతంగా తీశాడు అంటూ చాలామంది ప్రశంసలు కూడా చేశారు.

- Advertisement -

సాహో సినిమా తర్వాత సుజిత్ కి సినిమా చేయడానికి చాలా టైం పట్టింది. టైం తీసుకున్న కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో సినిమా చేసే అవకాశం దొరికింది. అయితే పవన్ కళ్యాణ్ కి సుజిత్ ఎంత పెద్ద ఫ్యాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ సినిమాకి పవన్ అభిమానులతో పాటుగా అరుస్తూ బయటకు వచ్చిన సుజిత్ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. అయితే సుజిత్ టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. సుజిత్ పవన్ కళ్యాణ్ కి స్వతహాగా అభిమాని కావడం వలన పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తే ఆడియన్స్ సాటిస్ఫై అవుతారని ఒక క్లారిటీ ఉన్న దర్శకుడు.

ఇకపోతే ఓజి సినిమాకు సంబంధించి ఇదివరకే ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం చాలామందిని ఆకట్టుగా ఉంది. అయితే ఈ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదే డేట్ కి కొన్నేళ్ల క్రితం అత్తారింటికి దారేది అని ఒక సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మళ్లీ సేమ్ డేట్ కి ఓజీ వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది అని చాలామంది నమ్ముతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. అయితే ఆ డేట్ కి సినిమా వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ చాలామందికి ఉంది.

ఇకపోతే సెప్టెంబర్ 27న ఓ జి సినిమా రిలీజ్ అవుతుందని డివివి దానయ్య మరోసారి క్లారిటీ ఇచ్చాడు. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా ట్రైలర్ లాంచ్ కి హాజరైన దానయ్య సెప్టెంబర్ 27న ఓజి సినిమా రాబోతుందని, మే నెల అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూట్ జరగనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు