Akhil akkineni new Movie Update : అయ్యగారి సినిమా అప్డేట్

Akhil akkineni new Movie Update : సిసింద్రీ సినిమాతో బాల నటుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. చాలా చిన్న ఏజ్ లో తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసాడు అని చెప్పొచ్చు. ఆ తర్వాత విక్రం కే కుమార్ దర్శకత్వం వహించిన మనం సినిమాలో కనిపించిన కాసేపు కూడా అద్భుతంగా అనిపించాడు. అక్కినేని నట వారసుల్లో అఖిల్ అద్భుతంగా సినిమాలు చేసి వారసత్వాన్ని నిలబెడతాడు అని అందరూ అనుకున్నారు. అఖిల్ హీరోగా పరిచయమైన సినిమా అఖిల్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేదు.

అఖిల్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అఖిల్, అక్కినేని హీరోలలా కాకుండా డాన్సులు మాత్రం అద్భుతంగా చేసాడు. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి నటుడు దొరికాడు అని కొంతమంది ద్వారా ప్రశంసలు కూడా అందుకున్నాడు. కానీ అఖిల్ కి సక్సెస్ మాత్రం అంత ఈజీగా రాలేదు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసినా కూడా అవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రమే ఆడాయి. చివరికి మనం లాంటి సూపర్ హిట్ సినిమాను అక్కినేని ఫ్యామిలీకి అందించిన విక్రం కే కుమార్ హలో సినిమా కూడా ఊహించిన విజయాన్ని అఖిల్ కి ఇవ్వలేకపోయింది.

ఇకపోతే అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి అఖిల్ ఖాతాలో ఒక హిట్ గా నిలిచింది. అప్పటికే బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా సరైన విజయం లేదు. బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడుగా పరిచయమైన భాస్కర్ కి మొదటి సినిమాతోనే మంచి పేరు లభించింది. ఆ తర్వాత చేసిన పరుగు సినిమా మెగా ఫ్యామిలీకి మరింత దగ్గర చేసింది.

- Advertisement -

అయితే రామ్ చరణ్ తేజ్ తో తీసిన ఆరెంజ్ సినిమా మాత్రం ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత ఒంగోలు గిత్త సినిమా చేశాడు భాస్కర్. ఇకపోతే అఖిల్ తో సినిమా చేసే టైం కి ఇటువైపు అఖిల్ కి అటువైపు భాస్కర్ కి ఇద్దరికీ హిట్ అవసరం. వీరిద్దరికి కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్టుగా నిలిచి గాడిలో పెట్టింది.

ఆ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన అఖిల్ కి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా మంచి ప్లస్ అవుద్ది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ గా మిగిలింది. ఎంతో హై బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా ఓటిటి డేట్ ను అనౌన్స్ చేసి కూడా రిలీజ్ చేయలేదు.

ఇకపోతే ఇప్పటివరకు అఖిల్ సినిమా అప్డేట్ గురించి వార్తలు రాలేదు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం అఖిల్ సినిమా ( Akhil akkineni new Movie Update ) ఆల్రెడీ లాక్ అయిపోయినట్లు తెలుస్తుంది. ఆ సినిమా యొక్క అధికారిక ప్రకటనను అఖిల్ పుట్టినరోజు సందర్భంగా చేయనున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు