Vijay Devarakonda With Rashmika : ఇన్నిసార్లు దొరికే బదులు చెప్పేయొచ్చు కదా బ్రో

Vijay Devarakonda With Rashmika : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని విషయాలను దాచడం అనేది అంత తేలికైన విషయం కాదు. చాలామంది సెలబ్రిటీస్ కి తెలియని విషయాలు కూడా ప్రేక్షకులకు తెలుస్తాయని చెప్పవచ్చు. ఒక హీరో హీరోయిన్ మధ్య స్నేహం చిగురిస్తేనే వాళ్ళ మధ్య ప్రేమ ఉందని డిసైడ్ చేసి రోజుల్లో ఉన్నారు తెలుగు ఆడియన్స్. ఇకపోతే హీరో హీరోయిన్ కలిసి ఒక మూడు సినిమాలు చేసిన కూడా వారి మధ్య ఏదో నడుస్తుంది అని కథనాలు కనిపిస్తాయి. ఎన్నో గాసిప్స్ వినిపిస్తాయి.

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమజంటలు ఉన్నాయి. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత తన మొదటి హీరో చైతుతో కొన్నేళ్లపాటు ప్రేమాయణం సాగించి తనను పెళ్లి చేసుకుంది. మళ్లీ వారి మధ్య ఉన్న వ్యక్తిగత కారణాల వలన వీరిద్దరూ విడిపోయారు. ఇక రీసెంట్ టైమ్స్ లో మహాసముద్రం సినిమాతో తెలుగు తెరకు మరోసారి పరిచయమయ్యాడు సిద్ధార్థ్. ఈ సినిమాలో నటించిన అదితి అగర్వాల్ తో ప్రేమాయణం సాగించి రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నాడు.

అయితే సిద్ధార్థ అండ్ అదితి కొన్ని ప్లేసులలో కనిపించడం. తర్వాత కొన్ని వార్తలు రావడం. ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టడం వీటి ద్వారా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని విషయం వీళ్లే చెప్పుకొచ్చారు. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు మరో జంట ఉంది వీరు ఇద్దరు ఇప్పటివరకు అధికారకంగా వారు ప్రేమలో ఉన్నట్టు రీవిల్ చేయలేదు. కానీ వారిద్దరూ ఒకే లొకేషన్ లో ఉన్న ఫొటోస్ మాత్రం వేర్వేరుగా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

తెలుగు యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అర్జున్ రెడ్డి సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని తనకంటూ ఇండస్ట్రీలో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. కేవలం సినిమాలు చేయటమే కాకుండా అటు బిజినెస్ రంగంలో కూడా తనను తాను సెట్ చేసుకొని చేసుకున్నాడు విజయ్. ఇకపోతే విజయ్ రష్మిక తో ప్రేమలో ఉన్నట్టు ఇదివరకే చాలా కథనాలు వినిపించాయి. వీళ్ళ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

గీత గోవిందం సినిమాతో వీరిద్దరూ కలిసి పరశురాం డైరెక్షన్లో నటించారు. అయితే అక్కడితో మొదలైన వీరి పరిచయం ప్రేమ వరకు కొనసాగింది. అయితే విజయ్ రష్మిక ( Vijay Devarakonda With Rashmika ) కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ సినిమా కూడా వచ్చింది. మాల్దీవ్స్ లో ఒకే లొకేషన్ లో వీరి ఫొటోస్ చాలాసార్లు వైరల్ అవుతూ వచ్చాయి. అంతేకాకుండా ఎయిర్ పోర్ట్ లో కూడా వీరిద్దరూ వేర్వేరుగా ఒకే టైంలో దర్శనం ఇచ్చారు.

ఇక ఏ సెలబ్రేషన్ అయినా కూడా రష్మిక ఫొటోస్ ను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫొటోస్ లో విజయ్ ఇంటి లొకేషన్ లో అని చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. అయితే విజయ్ తో సెలబ్రేషన్ చేసుకున్న కొంతమంది పీపుల్ రష్మిక తో సెలబ్రేషన్ చేసుకోవడం వలన ఆ ఫోటోలు రీవిల్ అవ్వడం వల్ల వీరిద్దరి మధ్య ఏదో ఉందని చాలా వార్తలు వినిపించాయి.

ఇకపోతే వీరిద్దరూ మరోసారి దొరికారు అని చెప్పొచ్చు. విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అమెరికా రిలీజ్ గురించి ఒక వీడియోను రిలీజ్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇకపోతే ఆ వీడియోలో ఒక హోటల్ లోకేషన్ ఉంది. వెనక నెమలి తిరుగుతున్న విజువల్స్ కూడా మనం ఆ వీడియోలో గమనించవచ్చు. ఇకపోతే రష్మిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక ప్లేస్ ను మెన్షన్ చేస్తూ ఒక నెమలి ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేసింది. విజయ్ వీడియో రిలీజ్ చేసిన లొకేషన్, రష్మిక పెట్టిన స్టోరీ లొకేషన్ కూడా ఒకటే ఉంది. ఈ విధంగా వీరిద్దరూ ఒకే ప్లేస్ లో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు