Manjummel Boys : కొండన్న తో బాయ్స్ ఢీ.. ప్రేమలు సీన్ రిపీటవుద్దా?

Manjummel Boys : టాలీవుడ్ లో ఈ మధ్య మలయాళ సినిమాల రచ్చ కూడా బాగా పెరిగింది. ఒకప్పుడు తమిళ్ డబ్ సినిమాలు మాత్రమే తెలుగులో సందడి చేసేవి. కానీ ఇప్పుడు తమిళ్, మలయాళం, కన్నడ అన్న తేడా లేకుండా అన్ని భాషల సినిమాలు తెలుగులో సందడి చేస్తున్నాయి. పైగా తెలుగు సినిమాలకు ధీటుగా ఆ సినిమాలు ఆడుతున్నాయి కూడా. ఇక ఈ ఏడాది మాత్రం తమిళ సినిమాల కంటే తెలుగులో మ‌ల‌యాళ డబ్బింగ్ సినిమాల హ‌డావుడి పెరిగింది. గ‌త రీసెంట్ గా భ్ర‌మ‌యుగం, ప్రేమ‌లు, అలాగే లేటెస్ట్ గా తేది గోట్ లైఫ్ చిత్రాలు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వీటిలో భ్ర‌మ‌యుగం, ది గోట్ లైఫ్ మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా తెలుగులో అంతగా ప్రభావం చూపలేదు. అవి ఒక డిఫరెంట్ జోనర్ సినిమాలు కాబట్టి వాటికి ఒక వర్గం ఆడియన్స్ మాత్రమే కన్సెట్ అయ్యారు. అయితే లవ్, ఎంటర్టైన్మెంట్ జోనర్ లో వచ్చిన ప్రేమ‌లు అంద‌రి అంచ‌నాల‌నూ మించిపోయి సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే బయ్యర్లకు మూడు రెట్ల లాభాన్ని అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది. మలయాళం డబ్ మూవీస్ లో తెలుగు లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

తెలుగు సినిమాలకి దెబ్బ !

అయితే ప్రేమలు సినిమా మార్చి రెండో వారంలో రిలీజ్ కాగా, దీంతో పాటుగా గామి, భీమా లాంటి క్రేజీ తెలుగు చిత్రాలు రిలీజ‌య్యాయి. కానీ వాటికి ధీటుగా ప్రేమ‌లు తెలుగు వెర్ష‌న్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ప్రేమలు బ్లాక్ బస్టర్ వసూళ్ళదుకుంది. పైగా భీమా మూవీకి ప్రేమ‌లు చాలా డ్యామేజ్ చేసిన మాట కూడా చాలా ఉంది. అలాగే గామి వ‌సూళ్ల మీద కూడా దీని ప్ర‌భావం కొంత ప‌డింది. అందుకే గామి బ్రేక్ ఈవెన్ అయినా లాంగ్ రన్ లో ఆడలేదు. దీంతో మ‌ల‌యాళ సినిమాల‌ను లైట్ తీసుకునే ప‌రిస్థితి లేదని తెలుస్తుంది. ఇక ఇప్పుడు మ‌ల‌యాళం నుంచి రానున్న కొత్త చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ మీద టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు ఫోకస్ పడింది. తెలుగులో ఫ్యామిలీ స్టార్ లాంటి క్రేజీ మూవీకి పోటీగా మంజుమ్మెల్ బాయ్స్ ఈ నెల 5న విడుద‌ల కాబోతోంది.

ప్రేమలు డ్యామేజ్ రిపీట్ అవుద్దా?

అయితే విజయ్ దేవరకొండ సినిమాకు మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys) సినిమా పోటీ అంటే చాలా మంది చిన్న సినిమాకు నష్టపోతుందని అనుకుంటారు. అలా అనుకునే అప్పుడు గామి, భీమా సినిమాలు ప్రేమలు వల్ల నష్టపోయాయి. మల్టీప్లెక్స్ ఆడియన్స్ దెబ్బ బాగా పడింది. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న మంజుమ్మేల్ బాయ్స్ ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. మంజుమ్మెల్ బాయ్స్ మల‌యాళంలో మామూలు సంచ‌ల‌నం రేప‌లేదు. రూ.200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌తో ఏకంగా ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. త‌మిళ‌నాట అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన మ‌ల‌యాళ చిత్రంగానూ నిలిచింది. అన్నిటికి మించి మ‌న తెలుగు ప్రేక్ష‌కులు అస‌లే కంటెంట్ బాగుంటే చాలు. ఏ భాష చిత్రమైనా హీరో ఎవరైనా సరే ఆద‌రిస్తారు.ఈ నేప‌థ్యంలో మంజుమ్మెల్ బాయ్స్ సినిమా ఫ్యామిలీ స్టార్‌కు ఎలాంటి డ్యామేజ్ చేస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. కాక‌పోతే మంజుమ్మేల్ బాయ్స్ ప్రేమలు లాగా ఎంటర్టైన్మెంట్ మూవీ కాదు. ఇది సీరియ‌స్ డ్రామా మూవీ. జ‌నాలు ఇప్పుడు ఎంట‌ర్టైన‌ర్స్ కోరుకుంటున్నారు. ఆల్రెడీ టిల్లు స్క్వేర్ ఇర‌గాడేస్తోంది. ఫ్యామిలీ స్టార్ కూడా మంచి ఎంట‌ర్టైన‌ర్ లాగే క‌నిపిస్తోంది. కాబ‌ట్టి వాటిని దాటి మంజుమ్మెల్ బాయ్స్ వైపు తెలుగు ప్రేక్ష‌కులు చూస్తారా అన్న‌ది కూడా ఆలోచించాలి. అయితే సీరియస్ డ్రామాగా వచ్చిన 2018 కూడా తెలుగులో బాగా ఆడిందన్న విషయం మర్చిపోకూడదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు