Manjummel Boys Telugu : ఫైనల్ గా తెలుగులో ఆరోజే ముహూర్తం!

Manjummel Boys Telugu : మలయాళంలో గత రెండు నెలలుగా వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర హంగామా నెలకొని ఉంది. దాదాపు నాలుగు సినిమాలు అక్కడ ఇదే సంవత్సరం వంద కోట్ల వసూళ్ళని అందుకున్నాయి. ఇక రీసెంట్ గా మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’. ఈ సినిమా గత ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మలయాళంలో కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మలయాళంలో అత్యధిక కలెక్షన్లు అందుకున్న చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది. కేవలం నెలరోజుల్లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఇప్పటికి అద్భుతమైన కలెక్షన్లతో రన్ అవుతుంది. అయితే అలాంటి సెన్సేషనల్ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుందంటూ నెలరోజుల క్రితమే అనౌన్స్ మెంట్ జరగగా, ఇప్పటివరకు రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు మేకర్స్. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఫైనల్ గా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా మంజుమ్మేల్ బాయ్స్ తెలుగు ( Manjummel Boys Telugu) మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇక 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తీసిన ఈ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’. టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను సొంతం చేసుకున్న ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ ను థియేటర్లలోకి తీసుకురాబోతోంది. గత కొన్నిరోజులుగా ఈ సినిమా రిలీజ్ అప్పుడూ, ఇప్పుడూ అంటూ వాయిదా వేస్తూ వస్తుండగా, ఫైనల్ గా 2024 ఏప్రిల్ 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

ప్రముఖ మలయాళ దర్శకుడు చిదంబరం S. పొడువల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రంలో సౌబిన్ షాహిర్, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి , జూనియర్ లాల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్, దీపక్, అర్జున్ కురియన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పరవ ఫిలింస్ బ్యానర్‌ పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు తెలుగు వెర్షన్‌ను మైత్రి నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి రిలీజ్ చేస్తున్నారు. ఇక ‘మంజుమ్మేల్‌ బాయ్స్‌’ మూవీ తెలుగులో కూడా అదే టైటిల్‌తో విడుదల కానుంది. ఈ చిత్రానికి సుశిన్ శ్యామ్ సంగీతం సమకూర్చారు.

- Advertisement -

2006లో కేరళకు చెందిన కొంతమంది స్నేహితుల బృందం తమిళనాడు కొడైకెనాల్ లోని నిషేధిత ప్రాంతమైన గుణ గుహలకు టూర్ కు వెళ్లి, వారిలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడిపోతే, ఆ స్నేహితుడిని కాపాడుకోవడం కోసం ఫ్రెండ్స్ చేసిన ప్రయత్నాలే ఈ సినిమా. పోలీసులు సైతం చేతులెత్తిన ఈ ఘటనలో తమ స్నేహితుడిని రక్షించుకోడానికి మంజుమ్మాళ్ బాయ్స్ ఏం చేసారు? చివరకు స్నేహితుడ్ని కాపాడుకున్నారా లేదా? అనేది తెలియాలంటే ‘మంజుమ్మేల్‌ బాయ్స్‌’ మూవీ చూడాల్సిందే. మరి మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు