Tamil Actor : ఇండస్ట్రీలో విషాదం.. ‘లొల్లు సభ’ నటుడి కన్నుమూత..

Tamil Actor : టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా పలువురు నటుల మరణం దిగ్బ్రాంతికి గురి చేసింది. లాస్ట్ ఇయర్ లో చంద్ర మోహన్, శరత్ బాబు వంటి నటులతో పాటు కొందరు చిన్న నటులు కూడా ఆకస్మికంగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాగే కోలీవుడ్ లో కూడా స్టార్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్ ఆకస్మిక మరణం లాస్ట్ ఇయర్ తమిళనాట తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రీసెంట్ గా ఇళయరాజా కూతురు కూడా చనిపోయింది. ఇలాంటి షాకింగ్ న్యూస్ ల నుండి తేరుకునే లోపే కోలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ నటుడు ( Tamil Actor ) , తమిళ సినీ హాస్యనటుడు శేషు మంగళవారం గుండెపోటుతో చికిత్సకు స్పందించలేక కన్నుమూశారు.

తమిళ్ లో విజయ్ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన ‘లొల్లు సభ’ షో ద్వారా శేషు ఫేమస్ అయ్యారు.ఇక పలు టివి షోలు చేస్తూనే సుమారు ఇరవై ఐదు చిత్రాలకు పైగా నటించిన శేషు, కరోనా సమయంలో చాలా మందికి సహాయం చేశారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు కాగా, ఆయనకు ముగ్గురు కొడుకులు. ఇటీవల శేషు తీవ్ర గుండెపోటుకు గురికాగా, గత కొన్ని రోజులుగా ఆళ్వార్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారం రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రేపు ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇకపోతే శేషు అసలు పేరు లక్ష్మీ నారాయణన్. అయితే ఇండస్ట్రీకి వచ్చాక హాస్యనటుడుగా తన రంగస్థల పేరు శేషుతో ప్రసిద్ది చెందాడు. ఇక అతను ప్రముఖ తమిళ సినిమాలను స్పూఫ్ చేసే ‘లొల్లు సభ‘ అనే టీవీ షో ద్వారా పాపులర్ అయ్యాడు. అంటే తెలుగులో జబర్దస్త్ షో లాంటిది అన్నమాట. ఇక ఈ కార్యక్రమం సంతానం, మనోహర్ మరియు స్వామినాథన్ వంటి నటులను కూడా పాపులర్ చేసింది. ఈ షో కి ‘దిల్లుకు దుడ్డు’ ఫేమ్ రంభాల దర్శకురాలు. ఇక ప్రముఖ కమెడియన్ సంతానం నటించిన సినిమాల్లో శేషు రెగ్యులర్ గా ఉంటాడు. అంతే కాదు పేద కుటుంబాల నుండి వచ్చిన మహిళలకు వివాహాలు ఏర్పాటు చేయడం వంటి మంచి పనులతో కూడా ఈ నటుడు ప్రసిద్ది చెందాడు. ఇక శేషు చివరిగా సంతానం హీరోగా నటించిన వడక్కుపట్టి రామసామి లో కనిపించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు