Family Star : మరీ ఇంత ఓపెన్ గా కాపీ చేస్తే ఎలా?

Family Star : టాలీవుడ్ లో ఏప్రిల్ లో రిలీజ్ కాబోయే క్రేజీ సినిమాల్లో ఫామిలీ స్టార్ మూవీ కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ కి ముందు నుండే మంచి క్రేజీ బజ్ తెచ్చుకుంది. గీతా గోవిందం తరవాత విజయ్ దేవరకొండ, పరశురామ్, గోపి సుందర్ కాంబోలో వస్తున్న మూవీ కాబట్టి సినిమాపై మంచి హైప్ వచ్చేలా చేసింది. ఇక రిలీజ్ అయిన టీజర్ ట్రోలింగ్ కి గురైనా, ఆ తరువాత మెల్లిగా జనాల్లోకి వచ్చింది. ఇక ఈ సినిమా పలు వాయిదాల అనంతరం సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అయింది. ఇకపోతే ఈ సినిమా నుండి రిలీజ్ అవుతున్న సాంగ్స్ మాత్రం విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. వినడానికి అంత బ్యాడ్ గా లేకపోయినా సాంగ్స్ మాత్రం ఎక్కడో విన్నట్టు అనిపిస్తున్నాయి. పైగా గోపిసుందర్ ఏమి కొత్తవాడు కాదు. నిన్ను కోరి, ఊపిరి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, గీత గోవిందం, మజిలీ లాంటి చిత్రాల్లో మెస్మరైజింగ్ మెలోడీస్‌తో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు.

అయితే ఇప్పుడు మాత్రం గోపిసుందర్ అంతగా సరైన ట్యూన్స్ ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇతర సినిమాల సంగతి అటుంచితే, ఫ్యామిలీ స్టార్ ( Family Star )కి మాత్రం సాంగ్స్ బాగా లేవని విమర్శలు వస్తున్నాయి. ఐతే కెరీర్ ఆరంభంలో మాదిరి ఆయన మెరుపులు మెరిపించడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. పైగా పాత ట్యూన్లను రిపీట్ చేస్తున్నాడని, ఇతర పాత సినిమాల నుండి పాటలను కాపీ చేస్తున్నట్టు ఉందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే గీత గోవిందం తర్వాత ఈ ముగ్గురి కలయికలో తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ విషయంలో గోపీసుందర్ ముందు నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సినిమా టీజర్‌కు అతడి స్కోర్ అస్సలు సూట్ కాలేదు. దాని మీద బాగా ట్రోలింగ్ జరిగింది. ఇక పాటల విషయంలోనూ అసంతృప్తే వ్యక్తమవుతోంది.

ఆ హిందీ పాటకి కాపీ..

ఫ్యామిలీ స్టార్ నుంచి రిలీజ్ చేసిన రెండో పాట ‘కళ్యాణి వచ్చా’ పాట అచ్చం మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమాలోని ‘అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా’ అనే పాటలా ఉందని, ఈ పాట ట్యూన్‌కు చాలా దగ్గరగా అనిపించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండిటిని పోలుస్తూ సోషల్ మీడియాలో గోపీసుందర్‌ను నెటిజన్లు ఆడుకున్నారు. ఇక ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి కొత్తగా ‘మధురము కదా’ అంటూ రిలీజ్ అయిన పాట వినసొంపుగా ఉంది. శ్రీమణి లిరిక్స్‌తో పాటు ట్యూన్, శ్రేయా ఘోషల్ సింగింగ్ అన్నీ బాగున్నా, ఎక్కడో విన్నట్టుందే అనిపిస్తుంది. కానీ ఈ పాట మొదలవగానే షారుఖ్ ఖాన్ నటించిన ‘దిల్ సే’ సినిమాలోని ‘జియా చలే’ పాటే గుర్తుకు వస్తోంది. దాదాపు ట్యూన్ సేమ్ స్టయిల్లో ఉంది. గోపీసుందర్ తెలిసి చేశాడా, తెలియక చేశాడా తెలియదు కానీ, ‘జియా చలే’కు ఇది కాపీలాగే ఉంది. ట్యూన్ చేసినపుడు కొంచెమైనా చెక్ చేసుకోరా.. ఇలా మక్కి కి మక్కి దించేస్తారా అని నెటిజన్లు అతడిపై కౌంటర్లు వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు