Shruthi Hassan : ఆ హీరోతో సినిమా చేయను… శృతిహాసన్ సంచలనం !

Shruthi Hassan : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruthi Hassan) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన తండ్రి కమల్ హాసన్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో వరుస హిట్లు అందుకుంటుంది. సమంత, రష్మిక మందాన, కాజల్ లాంటి హీరోయిన్లకు ఛాన్సులు దక్కకుండా చేస్తోంది హీరోయిన్ శృతిహాసన్. ముఖ్యంగా తెలుగు, తమిళ అలాగే హిందీ భాషల్లో నటించి పాపులారిటీని తెచ్చుకుంది హీరోయిన్ శృతిహాసన్.

పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి తెలుగులో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు చేసిన శ్రీమంతుడు సినిమాలో కూడా నటించి బంపర్ విషయాన్ని తన ఖాతాలో వేసుకుంది. క్రాక్, వీర సింహారెడ్డి, లాంటి బంపర్ హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ చేసిన సలార్ లో కూడా నటించింది. ఇలా హీరోయిన్ శృతిహాసన్ కు వరుసగా పెద్ద పెద్ద సినిమాలే వస్తున్నాయి. అటు తన పర్సనల్ లైఫ్ లో కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ.

మైఖేల్ కొసలే అనే వ్యక్తితో వసృతిహాసన్ డేటింగ్ చేస్తోందట. వీరిద్దరూ 2019 నుంచి రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా తాజాగా హీరోయిన్ శృతిహాసన్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఇనిమేల్ మ్యూజిక్ వీడియోతో అభిమానుల ముందుకు వచ్చిన హీరోయిన్ శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

తన నాన్న అనే కారణంతో కమల్ హాసన్ లాంటి పెద్ద హీరోతో కలిసి సినిమాలు చేయడం లేదని శృతిహాసన్ తేల్చి చెప్పారు. ఆయన కష్టపడి పని చేస్తారని…. ఈ సాంగ్ కోసం పది రకాల లిరిక్స్ ఇచ్చారని తెలిపారు. వాటిలో ఇదేలా ఉంది ? అదెలా ఉంది అని అడుగుతారే తప్ప ఇది బాగుందని చెప్పరు అంటూ శృతిహాసన్ పేర్కొన్నారు. అందుకే ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తానని తెలిపారు హీరోయిన్ శృతిహాసన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు