Amar Singh Chamkila : బయోపిక్ అయితే చాలు ఎవరిదైనా చూసేస్తారు..

Amar Singh Chamkila : బాలీవుడ్ లో బయోపిక్ చిత్రాలకు ఎలాంటి ఆదరణ ఉంటుందో చూస్తూనే ఉంటాం. గత రెండు దశాబ్దాలుగా ఇది పీక్స్ కి చేరింది. కథల విషయంలో కొత్తదనం కావాలంటే బయోపిక్ లకు ఎగబడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. ఆ దంగల్, ఎమ్మెస్ ధోని, భాగ్ మిల్కా భాగ్, రీసెంట్ గా 12th ఫెయిల్, మైదాన్ పలువురి జీవిత కథల నుండి స్ఫూర్తి గా తీసుకుని తెరకెక్కడం జరిగింది. ఈ మధ్య కాలంలో బయోపిక్‌ లకు మంచి స్పందన దక్కుతుంది కాబట్టి మేకర్స్ కాస్త కమర్షియల్‌ టచ్ ఉన్న బయోపిక్ ల తో పాటు వాటికి మసాలాలు యాడ్ చేసి, తీస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సమాజంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్ని కూడా హైలెట్ చేస్తూ వాళ్ళ బయోపిక్ లను తీసేస్తున్నారు. ఆ మధ్య టాలీవుడ్ లో వర్మ తీసినవన్నీ అలాంటి చిత్రాలే కావడం గమనార్హం. తాజాగా మరో బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

బూతు గాయకుడి బయోపిక్..

పంజాబ్‌ కు చెందిన సింగర్‌ ‘అమర్‌ సింగ్‌ చమ్కీలా’ (Amar Singh Chamkila) గురించి సౌత్‌ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ పంజాబ్ తో పాటు పలు నార్త్ ప్రేక్షకులకు అతను సుపరిచితుడే. తాజాగా అతని బయోపిక్ రావడంతో ఇప్పుడు అందరికీ అతని గురించి తెలుస్తుంది. 28 ఏళ్ల వయసుకే సింగర్ గా గుర్తింపు దక్కించుకుని, రెండు పెళ్లిళ్లు చేసుకుని, తన పాటల వల్ల విమర్శలు ఎదుర్కొని చివరకు అదే 28 ఏళ్ల వయసులో ఫ్యామిలీతో హత్య గావించబడ్డాడు. ఈయన జీవిత కథ లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. ఇక ఇతడు సింగర్ గా ఎదిగిన వైనం, అలాగే హత్య గావించబడడానికి గల కారణాలను ప్రస్తావిస్తూ ‘అమర్ సింగ్‌ చమ్కీలా’ అనే టైటిల్‌ తో సినిమా రూపొందించి, నేరుగా నెట్‌ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

అదే ఇతని మరణానికి కారణం..

అమర్ సింగ్ కి చిన్న వయసులోనే సొంతంగా పాటలు రాసుకుంటూ పాడటం అలవాటు. కానీ అతని సాహిత్యం బూతుల మయం గా ఉండేదని, అలాంటి పాటల వల్ల యువత చెడి పోతుందని చాలా మంది విమర్శించే వారు. అలా ఒక వైపు విమర్శలు పొందుతూనే మరో వైపు అంతకు పదిరెట్లు పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అయితే అప్పట్లో మొదటి భార్యకు తెలియకుండానే రెండో పెళ్లి చేసుకోవడం పెద్ద వివాదం అయింది. 1988 లో పంజాబ్‌ లోని మెహంసపూర్ గ్రామంలో ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో అమర్ సింగ్ మరియు ఆయన రెండో భార్య ను స్టేజ్ పై ఉండగానే కాల్చి చంపారు. ఇప్పటి వరకు అమర్ సింగ్‌ ను కాల్చి చంపింది ఎవరు అనే విషయంలో క్లారిటీ లేదు. అటు పోలీసులు కూడా చాలా కాలం పాటు ఎంక్వయిరీ చేసి వదిలేశారు. ఇలా అమర్‌సింగ్ జీవితంలో జరిగిన అన్ని విషయాలను ఈ సినిమాలో దర్శకుడు ఇంతియాజ్ అలీ చూపించాడు. దిల్‌ జిత్‌ దోసాంజ్ టైటిల్‌ రోల్‌ లో నటించగా పరిణితి చోప్రా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. థియేటర్ లో విడుదల అయ్యి ఉంటే భారీ వసూళ్లు నమోదు అయ్యేవని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతని బూతు పురాణం నచ్చక ప్రజలే అతడ్ని చంపేశారని ఒక వర్గం అంటుంటే, మొదటి భార్య బంధువులు రెండో పెళ్లి చేసుకున్నందుకు కక్ష్య కట్టి చంపారని మరో వర్గం వాళ్ళు చెప్పేవారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు