AR Rahman : అప్పుడే 2 సాంగ్స్ కంప్లీట్ చేసాడా.?

ఏ ఆర్ రెహమాన్ సంగీతం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఇళయరాజా దగ్గర శిష్యరికం చేసిన ఏఆర్ రెహమాన్ మొదటిగా ఆస్కార్ అవార్డుని అందుకున్న భారతీయ సంగీత దర్శకుడుగా పేరుపొందాడు. ఇక రెహమాన్ మ్యూజిక్ గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంతో కొంత మిగిలి ఉంటుంది అంతా అద్భుతమైన సంగీతాన్ని సినిమాలకు అందిస్తాడు రెహమాన్.

చాలామందికి మంచి లవ్ స్టోరీస్ అంటే మణిరత్నం గుర్తుకు వస్తాడు. ఎందుకంటే మణిరత్నం తీసిన లవ్ స్టోరీలు ఏకంగా హృదయానికి హత్తుకుంటాయి. అయితే మణిరత్నం తీసిన లవ్ స్టోరీస్ కి విజువల్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా ఆ సీన్స్ కి అంతటి అద్భుతమైన ఇంపాక్ట్ ను తీసుకొస్తుంది అని చెప్పొచ్చు.

రెహమాన్ సంగీతం ఒక మామూలు సినిమాను కూడా అద్భుతంగా మార్చగలుగుతుంది అని ఇదివరకే చాలాసార్లు రుజువైంది. ఒక సినిమాని రెహమాన్ సంగీతం లేకుండా చూసినప్పుడు ఆ సినిమాకి రెహమాన్ సంగీతం చేసిన తర్వాత చూసినప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అద్భుతమైన సాంగ్స్ను ఇవ్వడమే కాకుండా ఒక సీన్ ని ఎలివేట్ చేయడానికి కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

- Advertisement -

ఇకపోతే మణిరత్నం చేసిన ఎక్కువ సినిమాలకు రెహమాన్ సంగీతం అందించాడు. అలానే మణిరత్నం సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయిన విషయం మనకు తెలిసింది. అలానే చాలా రెహమాన్ సాంగ్స్ కూడా తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ అయిపోయాయి. ఎటువంటి సిట్యువేషన్ లో ఉన్నా కూడా మన మూడ్ ని మార్చడానికి మ్యూజిక్ ఎంతగా ఉపయోగపడుతుందో ఆ మ్యూజిక్ లో రెహమాన్ సాంగ్స్ కూడా అంతే కీలకపాత్రను వహిస్తాయి.

పోతే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన ఏ ఆర్ రెహమాన్ తెలుగులో అతి తక్కువ సినిమాలకు మాత్రమే సంగీతాన్ని అందించారు. ఇక తెలుగులో ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన కొమరం పులి సినిమా తర్వాత ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్ ఒక తెలుగు సినిమాకి కూడా సంగీతం అందించలేదు. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఏ ఆర్ రెహమాన్.

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా పూజ మార్చ్ 20న జరగనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయని, ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటలను ఏఆర్ రెహమాన్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే సినిమా పూజ అవ్వకముందే రెండు పాటలను పూర్తి చేయటం అంటే మామూలు విషయం కాదు.

ఇకపోతే దేవర సినిమాకి సంగీతం అందిస్తున్నాడు అనిరుధ్. అయితే దేవర సినిమాకి సంబంధించి మ్యూజిక్ లేట్ అవుతుందని ఇదివరకే చాలా కథనాలు వినిపించాయి. ఇకపోతే రెహమాన్ ను చూసి అనిరుధ్ నేర్చుకోవాలి అంటూ కొంతమంది కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు