Dil Raju : ఇక ఏ లాభం లేదని.. దానిపై ద్రుష్టి!

Dil Raju : టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలీ ఎంటెర్టైనర్స్ తీయడం లో దిట్ట అయిన దిల్ రాజు బ్యానర్ నుండి ఒకప్పుడు ఏదైనా సినిమా వస్తుందంటే చాలు అది మినిమం గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయేవారు జనాలు. ఆ రోజుల్లో థియేటర్లో అలా ఈయన బ్యానర్ పడిందంటే చాలు ఇది ఫ్యామిలీ సినిమా ఖచ్చితంగా మెప్పిస్తుంది అనుకునేవాళ్లు సినీ ప్రేక్షకులు. కానీ గత కొంత కాలంగా దిల్ రాజు నుండి ఒక్క సరైన సినిమా కూడా రాలేకపోతుంది. ఆ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ వైపు ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ఈయన పనితనం లో చురుకుదనం తగ్గింది కాబోలు. అందుకే నాసిరకం సినిమాలు వస్తున్నాయి. ట్రేడ్ విశ్లేషకులు కూడా ఈ మధ్య ఆయన బ్రాండ్ వాల్యూ దెబ్బ తింటోందని అంటున్నారు. రాజు స్థాయికి తగ్గ సినిమాలు రావట్లేదని ప్రేక్షకుల అభిప్రాయం. ఒకప్పుడు చిన్న సినిమాలతోనే అల్లాడించిన దిల్ రాజు ఇప్పుడు ఓ మోస్తరు సినిమాలు కూడా తీయలేకపోతున్నాడని అంటున్నారు. ఆ మధ్య వచ్చిన F3, శ్రీనివాస కళ్యాణం, థ్యాంక్ యు వంటి చిత్రాలు ఎంత బ్యాడ్ టాక్ తెచ్చుకున్నాయో తెలిసిందే. ఇక తాజాగా మరో సినిమాతో దిల్ రాజు సినిమాలంటే నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది.

ఫ్యామిలీ స్టార్ తో తెలిసిందా?

అయితే తాజాగా దిల్ రాజు(Dil Raju) బ్యానర్ లో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా భారీ అంచనాలతో వచ్చింది. పేరులోనే ఫ్యామిలీ యాడ్ చేయడంతో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ సినిమా చూసేసరికి తలా తోక సంబంధం లేదన్నట్టు, అక్కడక్కడా రొమాంటిక్ సీన్లు కూడా పెట్టి తలనొప్పి తెచ్చాడు దర్శకుడు.ప్రేక్షకుల అంచనాలకి పూర్తి విరుద్ధంగా ఉన్న ఈ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. బ్యాడ్ టాక్, నెగిటివ్ రివ్యూలతో రెండో రోజే సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. దిల్ రాజు చేసే ప్రయత్నాలన్నీ చేసాడు. కానీ రెండో రోజు నుండే వసూళ్లు బాగా డ్రాప్ అవగా, రంజాన్ రోజు, ఉగాది రోజు కాస్త వసూళ్లు రాగా, ఆ తర్వాత మొత్తం వసూళ్లు పడిపోయాయి. దిల్ రాజు ఎంతో శ్రద్ధ పెట్టి పబ్లిసిటీ చేసినా, స్వయంగా గ్రౌండ్‌లోకి దిగి ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకుంటూ సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వీకెండ్లోనే నిలబడలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు దాదాపుగా వాషౌట్ అయిందనే చెప్పాలి. పండగ రోజు వరకు రాజు కూడా పబ్లిసిటీ పరంగా కొంచెం ఎఫర్ట్ పెట్టినా తర్వాతి రోజు వసూళ్లు చూసి సినిమా మీద ఆయన ఆశలు వదులుకున్నట్లే తెలుస్తుంది.

ఇక ఆశిష్ సినిమా పై ఫోకస్?

ఇక దిల్ రాజు ఎంత ట్రై చేసినా రెండో వీకెండ్లో ఫ్యామిలీ స్టార్ సినిమా పుంజుకునే అవకాశాలు లేవని అర్థమై ఇప్పుడు ఆయన సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక తన దృష్టి మొత్తం ఇప్పుడు తన అన్న కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కిన ‘లవ్ మి’ మీదికి ఫోకస్ మళ్లింది. వైష్ణవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న ఈ విడుదల కానుంది. ఇక తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’ నిరాశపరచడంతో ఆశిష్ కెరీర్‌కు ఇది చాలా కీలకం. ఈ సినిమా హిట్ అవడం ఆశిష్‌కే కాదు, దిల్ రాజు కు తన బ్యానర్ కు కూడా చాలా అవసరం. అందుకే దిల్ రాజు ఫోకస్ మొత్తం ఇప్పుడు ఈ సినిమాపై పెట్టి, ప్రమోషన్లు గట్టిగా చేసి జనాల్లోకి సినిమాను తీసుకెళ్లాలని చూస్తున్నారు. అయితే ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ సినిమా అనుకున్నంత ఉండదేమో అని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకు సినిమా గురించి వచ్చిన టాక్ ప్రకారం కథ అంత గొప్పగా ఏమి లేదని వినిపిస్తుంది. అయినా దర్శకుడి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు