Krithi Shetty : టాలీవుడ్ ని వదలకూడదని ఫిక్స్ అయిన బేబమ్మ!

Krithi Shetty : టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో ఉవ్వెత్తున ఎగిసిపడిన కన్నడ భామ కృతి శెట్టి. బేబమ్మ గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అమ్మాయి ఆ తర్వాత వరుస హిట్లతో జోరు చూపించింది. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో ఊపు ఊపిన ఈ భామ తన రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేసింది. వరుసగా నాని, రామ్ వంటి మిడ్ రేంజ్ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రావడంతో ఇక స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో చక్రం తిప్పుదామనుకుంది. కానీ ఆ తర్వాత వరుస బెట్టి సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సరైన బ్రేక్ ఇవ్వలేదు. అయినా తన వరకు పెర్ఫార్మన్స్ విషయంలో చేయాల్సింది చేసింది. కానీ ఎంత స్టార్ హీరోయిన్ కైనా టాలీవుడ్ లో వరుసగా నాలుగైదు ప్లాపులు పడ్డాయంటే, కెరీర్ డైలమా లో పడ్డట్టే అని నెటిజన్లు అంటుంటారు. నెంబర్ వన్ అవుతుందన్న శ్రీ లీల కూడా వరుస ప్లాపులతో నెమ్మదించింది.

గోల్డెన్ లెగ్ నుండి ఐరన్?

అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఛాన్సులివ్వడంలో, అలాగే వాళ్లను పక్కన పెట్టేయడంలో ఒక మ్యాడ్‌నెస్ కనిపిస్తుంటుంది. కెరీర్ ఆరంభంలో రెండు మూడు హిట్లు పడ్డాయంటే గోల్డెన్ లెగ్ అంటూ వరుసగా ఛాన్సులిచ్చేస్తారు. పారితోషకాలు కూడా డబుల్ చేసేస్తారు. వాళ్ళ స్థాయికి మించి సమర్పించుకుంటారు. కానీ అదే హీరోయిన్‌కు వరుసగా కొన్ని ఫ్లాపులు వచ్చాయంటే, అప్పటికప్పుడు లైట్ తీసుకుంటారు. ఐరెన్ లెగ్ ముద్ర వేసి పక్కన పెట్టేస్తారు. కన్నడ భామ కృతి శెట్టి(Krithi Shetty) పరిస్థితి ఇలాగే తయారైంది. తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈమె ఆ సినిమా లో తన క్యూట్ లుక్స్‌ తో ఆకట్టుకోవడం, సినిమా కూడా పెద్ద హిట్టవడంతో ఆమెకు అవకాశాలు వరుసకట్టాయి. ఆ తర్వాత వరుస హిట్లతో చూస్తుండగానే పారితోషకం రెండు కోట్లు పెంచింది. కానీ ఎంత వేగంగా రైజ్ అయిందో అంతే వేగంగా కింద పడింది కృతి. వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ డిజాస్టర్లతో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో ఆమె డిమాండ్ దాదాపుగా పడిపోగా, అవకాశాలు ఆగిపోయాయి. ఇప్పుడు ఆమె చేతిలో శర్వానంద్ సినిమా ‘మనమే’ తప్ప ఏది లేదు.

టాలీవుడ్ ని వదలొద్దని ఫిక్స్ అయిందా?

అయితే కృతి శెట్టి తన కెరీర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ లో చాల హై చూసింది. ఇక్కడ వచ్చినంత భారీ హిట్లు ఇతర ఇండస్ట్రీల్లో ఆమెకు దక్కుతాయా అంటే డౌటే. ఇటు కృతి కి కూడా టాలీవుడ్ రేంజ్ ఏంటో తెలుసు కాబట్టి టాలీవుడ్ ని వదలకూడదని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పైగా తనపై ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర పడడంతో గ్లామర్ ఫొటో షూట్లు చేస్తూ హాట్ గా కనిపించడానికి కూడా సిద్ధమని హింట్ ఇస్తుంది కృతి. పైగా ఈ మధ్య పారితోషకం కూడా సగానికి సగం తగ్గించినట్లు సమాచారం. అయినా తెలుగులో అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తమిళంలో మాత్రం ఆమెకు రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. అయితే టాలీవుడ్ ని కాదని ఇతర ఇండస్ట్రీలకు వెళ్ళిపోయిన పూజ హెగ్డే, తమన్నా లాంటి హీరోయిన్లు ఎలా ఫేడ్అవుట్ అయ్యారో తెలిసిందే. ఆ తప్పు కృతి శెట్టి చేయకుండా ఓపికతో టాలీవుడ్ లోనే అవకాశాల కోసం చూస్తుందని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు