Ranbeer – Alia: విడాకులకు సిద్ధమైన బాలీవుడ్ జంట.. ఆమె కారణం..?

Ranbeer – Alia : ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ప్రేమించి మరీ వివాహం చేసుకొని ఒక ఇంటి వారు అవుతున్న విషయం తెలిసిందే.. అయితే వీరిలో కొన్ని జంటలు మాత్రమే తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.. మరికొంతమంది పలు కారణాల వల్ల విడాకుల వరకు వెళ్తున్న విషయం తెలిసిందే. మరి కొంతమంది ఎంత అన్యోన్యంగా ఉన్నా సరే ఒక్కొక్కసారి మీడియా కంట పడకపోయినా.. ఒకే ఫంక్షన్ లో కనిపించకపోయినా.. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వడం సహజం.. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిన్ కారణంగా ప్రముఖ బాలీవుడ్ క్యూట్ జంట విడిపోతున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

రణబీర్ – ఆలియా విడాకులు..

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆలియా భట్ – రణబీర్ కపూర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు.. అయితే వివాహం కంటే ముందే గర్భం దాల్చిన ఆలియా వివాహం జరిగిన ఆరు నెలలకే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో చాలా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ తాను గర్భం దాల్చిన తర్వాతే వివాహం చేసుకున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎక్కడికి వెళ్లినా కలిసి కనిపించే ఈ జంటపై ఇప్పుడు విడాకులంటూ రూమర్స్ రావడం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది.

Ranbeer - Alia: Because of her.. bollywood couple going to take divorce..!
Ranbeer – Alia: Because of her.. bollywood couple going to take divorce..!

విడాకులకు కారణం..

అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన నటనతో , డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఒకవైపు డాక్టర్ గా వృత్తిని కొనసాగిస్తూనే.. మరొకవైపు యాక్టర్ గా తన కెరియర్ ను కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఈమె వల్లే రణబీర్ – ఆలియా విడిపోతున్నారు అంటూ ఒక వార్త రావడం గమనార్హం. ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఒక బ్యాడ్ సెంటిమెంట్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సాయి పల్లవి తో కలిసి నటిస్తే ఆ హీరోలు తమ భార్యలకు విడాకులు ఇవ్వాల్సిందే అంటూ ఒక వార్త తెరపైకి రావడం గమనించదగ్గ విషయం.. ఇదివరకే మారి 2 సినిమాలో ధనుష్ తో కలిసి సాయి పల్లవి నటించగా.. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ కు విడాకులు ఇచ్చారు.

- Advertisement -

మరొకవైపు నాగచైతన్య తో లవ్ స్టోరీ సినిమా చేసింది ఈమె.. ఈ సినిమా స్టోరీ వింటున్న సమయంలోనే నాగచైతన్య తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఇక ఇప్పుడు హిందీ రామాయణంలో రణబీర్ తో కలిసి సాయి పల్లవి నటిస్తోంది.. కాబట్టి రణబీర్ కూడా తన భార్యకు విడాకులు ఇస్తాడేమో అంటూ నెటిజన్లు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం వీరిద్దరూ ఈమె వల్లే విడాకులు తీసుకోబోతారు అంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది. మరి దీనిపై అటు రణబీర్ జంట, ఇటు సాయి పల్లవి ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు